Home Unknown facts Veerabhadrudu padhihasthalatho trinethrudai darshanam ichhe adbhutha aalayam

Veerabhadrudu padhihasthalatho trinethrudai darshanam ichhe adbhutha aalayam

0

దక్షుడు చేసిన యాగానికి వెళ్లిన పార్వతీదేవి అవమాన భారాన్ని తట్టుకోలేక ఆత్మాహుతి చేసుకుంటుంది. అది తెలిసిన ప్రళయ తాండవం చేస్తూ వీరభద్రుడిని సృష్టించి అతడితో యాగాన్ని చిన్న భిన్నం చేసి దక్షుడిని చంపిస్తాడు. ఆలా శివుడి ప్రతిరూపం అయినా వీరభద్రుడికి మన దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే వీరభద్రుడు పదిహస్తాలతో త్రినేత్రుడై భక్తులకి దర్శనం ఇస్తాడు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.veerbhadra swamyతెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా కి 60 కిలోమీటర్ల దూరంలో మహబూబాబాద్ నుండి 9 కి.మీ. దూరంలో కురవి అనే గ్రామంలో శ్రీ వీరబద్రస్వామి ఆలయం కలదు. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని వేంగి చాళుక్యుల కట్టించారని ఆ తరువాత కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందినట్లు చెబుతారు. ఈ దేవాలయంలోని మూలవిరాట్టు శ్రీ వీరభద్రేశరస్వామి పశ్చిమదిశగా భద్రేశ్వర సమేతంగా కొలువై ఉన్నాడు. ఈ స్వామివారు పది హస్తాలతో, త్రినేత్రుడై, రౌద్ర పరాక్రమాలకు ప్రతిరూపంలా భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. ఈ స్వామికి నోటికి ఇరువైపులా రెండు కోరలతో ప్రకాశిస్తూ కుడివైపున ఒక హస్తంలో కత్తి, రెండవ హస్తంలో త్రిశూలం, మూడవ హస్తంలో విల్లు, నాల్గవ హస్తంలో బాణం, ఐదవ హస్తంలో ముద్గరమును కలిగి ఓ చేత్తో ఓదారుస్తూ అభయాన్ని ప్రసాదిస్తున్నారు. స్వామివారి చెంతనున్న విఘ్నేశ్వరునికి నాలుగు చేతులుంటాయి. గర్భాలయ ముఖద్వారంలో రెండు పూర్ణకుంభాలు చెక్కబడి ఉన్నాయి. ఈ స్వామివారు కోరిన కోర్కెలు తీర్చే ప్రత్యేక్ష దైవంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్దలతో కొలుస్తారు. ఈ ఆలయం 24 స్థంబాల మహా మండపంతో మూడు గర్భాలయాలు కలిగి ఉంటుంది. ఇక్కడ కొలువై ఉన్న వీరభద్రస్వామిని వీరబద్రన్న అంటూ స్థానికులు పిలుస్తారు.ఈవిధంగా పదిహస్తాలతో, త్రినేత్రుడై వెలసిన ఈ వీరభద్రస్వామికి శివరాత్రి సమయాల్లో బ్రహ్మోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. శివరాత్రి సమయంలో ఈ ఆలయానికి భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది.

Exit mobile version