Home Entertainment Venkatesh’s Daughter Aashritha Daggubati Penned An Emotional Note To Her Father After...

Venkatesh’s Daughter Aashritha Daggubati Penned An Emotional Note To Her Father After Watching Narappa: Here It Is

0

నాన్న… నారప్ప చూసాను, ఎంతో భావోద్వేగానికి లోనయ్యను. మీ నటనకి జోహార్లు

నాన్న మీ ప్రతి సినిమాని మీతో కలిసి మొదటి షో చూసేదాన్ని, కానీ పరిస్థితులు మారాయి. ఈ క్షణం మీతో ఇంటి దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది, కానీ చాలా దూరంలో ఉన్నాను… ఈ దూరాలు ఇవేమీ ఇవాళ నన్ను మిమ్మల్ని ప్రశంసించకుండా ఆపలేవు. ఇవాళ మీరు పొందుతున్న ఘనత అంత మీరు స్వయానా సాధించుపెట్టుకుంది. నారప్ప పాత్రలో మీరు మిమలన్నే గెలిచారు. అసలు నారప్ప గా మీ ఆహార్యం మీ అభినయం గుండెలన్నీ తాకింది.
ఇది మీ లైఫ్ టైం పెర్ఫార్మెన్స్.

నారప్ప గా కుటుంబం కోసం ఎంత దూరమైన వెళ్లే పాత్రలో మీరు ఇంత అద్భుతంగా ఎందుకో నటించారో తెలుసా? ఎందుకంటే నిజజీవితంలో మీరు కూడా నారప్ప లాంటి గొప్ప తండ్రి కాబట్టి. మీ లాంటి తండ్రి దొరకడం నా అదృష్టం, ఈ ప్రపంచంలో మీ అంత గొప్ప తండ్రి మరొకరు వుండరు ఏమో!

Venkatesh Daughterతెర మీద, తెర వెనుక మీరు ఇప్పుడు ఒకేలా ఉంటారు. మీ ఆత్మలో ఒక స్వచ్ఛమైన నిజాయతీ ఉంటుంది. మీ గురించి ఎన్ని చెప్పిన తక్కువే, పదాలు కూడా సరిపోవు నాన్న నీ ముందు. మీలా నేను సగం బతికిన చాలు అదే నా జీవితంలో గొప్ప ఘనత అవుతుంది.

నాన్న, ఈ ప్రపంచంలో మీలా మీరు ఒక్కరే.
జీవితాంతం మీకు రుణపడి ఉంటాను.
ఆకాశం అంత ప్రేమతో మీ ❤

Exit mobile version