ఆరోగ్యకరమైన శరీర పనితీరుకు విటమిన్లు మరియు ఖనిజాలు చాలా ముఖ్యమైనవి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో వివిధ విటమిన్లు వేర్వేరు పాత్రలను పోషిస్తాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని ప్రోత్సహిస్తుంది, అయితే ఎముకలను బలోపేతం చేయడానికి విటమిన్ డి బాధ్యత వహిస్తుంది, అది మనందరికీ తెలుసు. కానీ సమానంగా అవసరమైన విటమిన్లు కొన్ని తక్కువగా తెలిసిన రకాలు ఉన్నాయి. విటమిన్స్ అంటే అందులోని ప్రతి ఒక్క విటమిన్ ఆరోగ్యానికి ఉపయోగపడేవని గుర్తించాలి. కానీ విటమిన్స్ లో చాలా మంది ఈ విటమిన్ కె గురించి మర్చిపోతుంటారు. నిజానికి విటమిన్ కె అనేది ఒక రకమైన విటమిన్. దీని గురించి చాలా అరుదుగా చెప్పుకుంటాం కాని ఇది టన్నుల కొద్దీ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.
విటమిన్ కె లో విటమిన్ కె1 , విటమిన్ కె2 అని రెండు రకాలు. విటమిన్ కె1 ని విటమిన్ కెజె (ఫిల్లొక్వినోన్) అని కూడా పులుస్తారు. విటమిన్ కె1 – మొక్కలలో తయారవుతుంది. అన్ని ఆకుపచ్చని ఆకుకూరలలోను, సోయాబీన్ లలోను లభిస్తుంది. మానవ చిన్నపేగులలో బాక్టీరియా విటమిన్ కె1 ను విటమిన్ కె2 గా మార్చుతు ఉంటుంది. విటమిన్ కె2 ఎముకల జీవపక్రియలో సహాయపడుతుంది. విటమిన్-కె ను కృత్రిమంగా తయారు చేస్తున్నారు. వాటిలో కె3 , కె4 ,కె5 లు ఉన్నాయి. అయితే కె1, కె2 విటమిన్లు హానికరము కావు. కానీ కృత్రిమంగా తయారు చేయబడే విటమిన్లు కె3 కొంతవరకు హానికరమని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ కె 1 మొక్కల ఆధారిత ఆహారాలలో, ప్రధానంగా ఆకుకూరలలో లభిస్తుంది. కాగా, విటమిన్ కె 2 జంతువుల ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. రక్తం గడ్డకట్టడంలో ఉపయోగపడే ఒక ఫేక్టర్. మరియు విటమిన్ కె ఎముకలకు మరియు కండరాలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది. అన్ని రకాల వ్యాధుల నుండి గుండెను రక్షిస్తుంది. విటమిక్ కె లోపమున్న వారిలో బోన్ ఫ్రాక్చర్ అయ్యే ప్రమాధం ఎక్కువగా ఉంది . అలాగే ఇది క్యాన్సర్ సెల్స్ వ్రుద్ది చెందకుండా శరీరానికి కాపాడుతుంది. విటమిన్ కె లోపం ఉంటే ఏదైనా గాయమైనప్పుడు రక్తస్రావం తొందరగా ఆగదు. చిన్న దెబ్బలకి కూడా ఎక్కువ రక్తం పోతుంది.
విటమిన్ కె చాలినంత లేకపోతే రక్తహీనత లేదా అనీమియా ఏర్పడవచ్చు. అనీమియా వల్ల నీరసం గా, ఓపిక లేకుండా ఉంటారు. కడుపు నొప్పి కి కూడా విటమిన్ కె డెఫిషియెన్సీ కారణం కావచ్చు. ముక్కులో నుండి రక్తం కారడం కూడా విటమిన్ కె సరిపోయినంత లేదనడానికి సూచనగా భావించవచ్చు.
మరి ఈ విటమిన్ మనకు ఏ ఆహారంలో దొరుకుతుందో తెలుసుకుందాం…
-
కాలీఫ్లవర్ :
భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఇష్టపడే కూరగాయలలో కాలీఫ్లవర్ ఒకటి . ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ నుండి ఓబకాయం మరియు ఆర్థరైటిస్‌ను నివారించడం వరకు కాలీఫ్లవర్ పుష్కలంగా ప్రయోజనాల కలిగి ఉంది . ఇది విటమిన్ కె అధికంగా ఉండే ఆహారం కూడా. 1 కప్పు కాలీఫ్లవర్‌లో 19% విటమిన్ కె ఉంటుంది.
-
బ్రోకలీ :
విటమిన్ కె అధికంగా ఉండే బ్రోకలీ ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది. విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లతో నిండిన బ్రోకలీ క్రమం తప్పకుండా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలను నివారించగలదు.
-
లెట్యూస్:
లెట్యూస్‌లో విటమిన్ కే తో పాటూ ప్రొటీన్, విటమిన్ ఏ, పొటాషియం ఉన్నాయి. లెట్టూస్ తో సహజం గా సలాడ్ గానీ శాండ్విచ్ కానీ చేస్తారు. కానీ, మిలమిలా మెరిసే ఈ ఆకు కూరని చాలా రకాలుగా వండచ్చు. లెట్టూస్ రాప్డ్ కాటేజ్ చీజ్ రోల్స్, లెట్టూస్ సూప్, లెట్టూస్ స్టర్ ఫ్రై వంటివి కూడా చేయవచ్చు.
-
ఎగ్స్:
ఎగ్స్ లో హై-క్వాలిటీ ప్రొటీన్ ఉంటుంది. ఎగ్ లో శరీరానికి కావాల్సిన విటమిన్ కె లభిస్తుంది. ఎగ్ ని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. ఆమ్లెట్, స్క్రాంబుల్డ్ ఎగ్స్, పోచ్డ్ ఎగ్స్, ఎగ్ కర్రీ, ఎగ్ స్టర్ ఫ్రై, ఎగ్ బిర్యానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్.. ఇలా ఎన్నైనా చెప్పుకుంటూ పోవచ్చు. సింపుల్ గా హార్డ్ బాయిల్డ్ ఎగ్ కూడా సాల్ట్ పెప్పర్ తో ఎంజాయ్ చేస్తాం కదా.
-
పార్ల్సే:
పార్ల్సే ఆరోమాటిక్ వాసన కలిగి ఉంటుంది . ఇందులో విటమిన్ ఎ, సి మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. ఇది ఆర్థరైటిస్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యంగా పనిచేయడానికి సహాయపడుతుంది.
-
పాలకూర :
పాలకూరలో ప్రోటీన్, విటమిన్లు ఎ, కె మరియు పొటాషియం అధికంగా ఉంటాయి. ఒక కప్పు పాలకూరలో 61 ఎంసిజి విటమిన్ కె ఉంటుంది. విటమిన్ కె యొక్క అధిక వనరులలో పాలకూర ను చేర్చ వచ్చు .
-
చికెన్ :
మాంసాహారులలో అత్యంత ఇష్టపడే ఆహార ఎంపికలలో చికెన్ ఒకటి. ఇది విటమిన్ కె 2 యొక్క గొప్ప మూలం. చికెన్ విటమిన్ కె అధికంగా ఉండే ఆహారం.
-
పచ్చిబఠానీలు:
గ్రీన్ పీస్ లో విటమిన్ ఎ, సి, మరియు కె లు పుష్కలంగా ఉన్నాయి. పచ్చిబఠానీల్లో ఫైబర్ అధికంగా ఉంది మరియు ఫ్యాట్ తక్కువ, రెగ్యులర్ బ్లడ్ షుగర్ లెవల్స్ ను గ్రేట్ గా మెయింటైన్ చేస్తుంది మరియు స్టమక్ క్యాన్సర్ నివారిస్తుంది.
-
కివీ:
కివీని పోషకాల గని గా చెప్పుకోవచ్చు. విటమిన్ కే తో పాటూ, విటమిన్స్ ఏ, బీ12, బీ6, ఈ, ఐరన్, కాల్షియం, పొటాషియం కివీలో ఉంటాయి. కివీ కుకంబర్ జ్యూస్, కివీ స్మూతీ, కివీ అప్ సైడ్ డౌన్ కేక్, కివీ పావ్లోవా, కివీ సలాడ్, కివీ బ్రెడ్ హల్వా వంటివి కివీ తో తయారు చేయవచ్చు. అలాగే తినేసినా కూడా కివీ ఎంతో రుచిగా ఉంటుంది.
-
తులసి:
తులసి ఆకుల్లో కూడా విటమిన్ కె అధికంగా ఉంటుంది.1/4కప్పు తులసి ఆకులో మ్యాంగనీస్, పొటాషియం, కాపర్ పుష్కలంగా ఉంటుంది.