Home Unknown facts కలువ పువ్వులతో ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు!

కలువ పువ్వులతో ఇలా చేస్తే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు!

0

ఈ సృష్టిలో ఏ విశ్వ చైతన్యం నిండి ఉంది? గ్రహాలు, లోకాలు, సకల జగత్తు ఏ శక్తి నుంచి ఆవిర్భ విస్తున్నాయి? సర్వ ప్రాణుల్లో ఉన్న జీవానికి మూల రూపం ఎవరు?, పుట్టుకకు, చావుకు మధ్యలో ఈ చైతన్యం అంతా ఎక్కడ నిక్షిప్తమై ఉంది?
ఆ శక్తి పేరే ఆదిశక్తి. ఆమే పరాశక్తి. సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరు ఇస్తున్నారో ఆ శక్తినే మన మహర్షులు దేవి అన్నారు.

kaluva puvvuఅటువంటి అమ్మ వారికి ఇష్టమైన రోజులలో మంగళవారం ఒకటి. అమ్మవారికి ఇష్టమైన ఈ రోజున ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో, సకల సంపదలతో గడుపుతారని పండితులు చెబుతున్నారు.

అయితే మంగళవారం అమ్మవారికి పూజ చేసే సమయంలో కొన్ని నియమాలు పాటించి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై కలుగుతుంది. ముఖ్యంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పువ్వులను అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారు ఎంతో ప్రీతి చెంది మన కోరికలు నెరవేరుస్తారు.

ప్రతి మంగళవారం మన ఇంటి గుమ్మానికి ఇరువైపులా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కలువ పువ్వులను పెట్టడం ద్వారా అమ్మవారు సంతోషించి మనకున్న అష్టదరిద్రాలను తొలగించి అష్టైశ్వర్యాలను కల్పిస్తుంది. అయితే ఆ తామర పువ్వులను ప్రతిరోజు మారుస్తూ పెట్టడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.

ఒకవేళ కలువ పువ్వు దొరకని పక్షంలో ఇతర ఎరుపురంగు పువ్వులను పెట్టడం మంచిది. కానీ ప్రతి మంగళవారం శుక్రవారాలలో తామర పువ్వులను పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు.

ఒకవేళ మన ఇంటి గుమ్మం ఈశాన్యం వైపు ఉంటే గుమ్మానికి ఉత్తరం వైపు ఒక రాగి చెంబులో కొన్ని నీటిని తీసుకొని అందులో పువ్వులు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. అదేవిధంగా గుమ్మం లోపల రాగి చెంబులో నీటిని నింపి అందులో ఒక ఐదు రూపాయల బిళ్ళలు, పచ్చ కర్పూరం, ఎర్రని పువ్వులు వేసి గుమ్మానికి ఒక వైపు ఉంచాలి.
ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయి.

అదేవిధంగా ప్రతి శుక్రవారం, మంగళవారాలలో గడపకు, తులసికోటకు పసుపు రాసి పూజ చేయటం వల్ల అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది.
అలాగే సంధ్యాసమయంలో ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల మన ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణ పరిస్థితులు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

Exit mobile version