Home Health నోటిలో పుండ్లు రావడానికి గల కారణాలు ఏంటి ?

నోటిలో పుండ్లు రావడానికి గల కారణాలు ఏంటి ?

0

వేడి వేడి టీ తాగినా లేదా ఒంట్లో వేడి చేసినా నోట్లో పండ్లు, పొక్కులు వస్తూ ఉంటాయి. హార్మోన్లలో మార్పులు, అధిక ఏసీడీటీ, వైరస్ దాడులు, నోట్లో పులుపు, నోరు కొరికేసుకోవడం, ఒత్తిడి, జన్యుపరమైన సమస్లు, విటమిన్ B సరిపడా లేకపోవడం, అజీర్తి వంటివి నోట్లో పుండ్లు రావడానికి కారణం అవుతాయి. అవి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఏది తిన్నా, ఏది తాగినా.. అవి మండిపోతూ, ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని పోగొట్టుకోవడం చాలా తేలిక. ఇందుకోసం సింపుల్ చిట్కాలు పాటించాలి.

causes of mouth soresనోరు, పెదవులు, నాలికపై అల్సర్లు ఉన్నప్పుడు తేనెను రాసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. కురుపులపై రోజుకు 3 లేదా 4 సార్లు తేనెను రాసుకోవాలి. దీని వల్ల మీకు చాలా ఉపశమనం కలుగుతుంది.

నోట్లో పుండ్లు, నాలికపై కురుపులు, మంట పోవడానికి నెయ్యిని రాసుకోవాలి. రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి. తెల్లారేసరికి గాయాలు మాయమవుతాయి.

అలోవెరా రసాన్ని గాయాలపై రాయాలి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొన్ని రోజుల్లోనే అల్సర్లు పూర్తిగా పోతాయి.

ఉదయం లేచాక, ఐదారు తులసి ఆకులు తినాలి. తులసి యాంటీ బ్యాక్టీరియా గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాని చితకబాది, చంపుతాయి.

నోట్లో అల్సర్ల వల్ల మంటగా ఉంటే, ఓ ఐస్ ముక్క తీసుకొని మంటగా ఉన్న చోట పెట్టుకోవాలి. తద్వారా మంట తగ్గి ఉపశమనం కలుగుతుంది.

వేడిగా ఉడుకుతున్న నీటిలో అరకప్పు మెంతులు వేసి, ఓసారి కలిపి, మూతపెట్టాలి. కాసేపటి తర్వాత నీటిని ఫిల్టర్ చేసి, మెంతులు వదిలేసి నీటిని రోజుకు 2 లేదా 3 సార్లు పుక్కిలించాలి. ఇలా చేస్తే వెంటనే రిలీఫ్ లభిస్తుంది.

పసుపు కూడా ఎంతో మంచిది. ఇది అల్సర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పసుపు నీటితో ఉదయం, సాయంత్రం పుక్కిలిస్తే ఎంతో రిలీఫ్ లభిస్తుంది. నొప్పి కూడా తగ్గుతుంది.

కొత్తిమీర చాలా చల్లదనం ఇస్తుంది. ఇది బాడీలో వేడిని తగ్గిస్తుంది. కొత్తిమీరను గ్రైండ్ చేసి, రసం తీసి దాన్ని అల్సర్లు ఉన్నచోట రాసుకోవాలి. 2 నుంచి 3 రోజుల్లో రిలీఫ్ లభిస్తుంది.

ఓ కప్పు నీటిలో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసి కలపాలి. ఈ నీటిని నోట్లో పోసుకొని, 1 నిమిషం పుక్కిలించి ఊసేయాలి. మంచి ఫలితం ఉంటుంది.

Exit mobile version