Home Health రక్తహీనత కారణంగా మహిళల్లో వచ్చే సమస్యలు ఏంటో తెలుసా ?

రక్తహీనత కారణంగా మహిళల్లో వచ్చే సమస్యలు ఏంటో తెలుసా ?

0

మహిళల్లో పీరియడ్స్ లేట్ గా రావటం లేదా పీరియడ్ మిస్ కావటం చాలా సహజం. కానీ ఇందుకు కారణాలు మాత్రం తెలుసుకుని తీరాల్సిందే. గర్భం రావటం, మెనోపాజ్ రావటం లేదా ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. విపరీతమైన మానసిక ఆందోళనలో ఉన్నప్పుడు కూడా సైకిల్ ట్రాక్ తప్పుతుంది. 30 రోజులైనా పీరియడ్ రాకపోతే మాత్రం దాన్ని లేట్ పీరియడ్ అంటారు. గత నెలలో వచ్చిన పీరియడ్ ముగిసిన తరువాత 30 రోజులుగా దీన్ని లెక్కించాలి. ఇక 6 వారాల పాటు పీరియడ్ రాలేదంటే పీరియడ్ మిస్ అయినట్టు లెక్క. ఇలా ఏడాదిలో 6-7సార్లు అయిందంటే అనుమానపడాల్సిందే..

periodనెలకోమారు నెలసరి రాలేదంటే టెన్షన్ పడకుండా అందుకు కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేయటంతో పాటు అవసరమైతే వైద్యులను సంప్రదించాల్సిందే. మెనుస్ట్రువల్ సైకిల్ గురించి చెప్పాలంటే నెలకోసారి అంటే 28 రోజులకు ఓసారి లేదా 21-35 రోజుల మధ్య బహిష్ఠు అవ్వటం తప్పనిసరి. ఇలా 35 రోజులు దాటిందంటే మాత్రం నెలసరి గడబిడ అయినట్టే.

హార్మోన్ల అసమతుల్యం కారణంగా నెలసరి సమయానికి రాకపోవచ్చు. జన్యుపరమైన కారణాలు కూడా ఇందుకు మూల కారణం కావచ్చు. వ్యాధి నిరోధకత తగ్గడం కూడా ఇందుకు దారితీయవచ్చు. పాలిసిస్టిక్ ఓవరీ డిసార్డర్ (PCOD) పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేవి ఇవాళ రేపు తరచూ వింటున్నాం. ఇలాంటి సమస్యలున్నవారిలో పీరియడ్స్ లేటుగా రావటం లేదా త్వరగా రావటం వంటివి జరుగుతాయి. PCOS, PCOD సిస్టుల కారణంగా హార్మోన్ల పనితీరు మందగించి ఇవన్నీ తలెత్తుతాయి. ఇలాంటి వారిలో పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా తగ్గచ్చు. లైఫ్ స్టైల్ లో మార్పులు చేసుకోవటం, చికిత్స తీసుకోవటం వంటివి చేయటంతో ఈ అనారోగ్యాన్ని అధిగమించవచ్చు.

రక్తహీనత కారణంగా మహిళల్లో ఈ సమస్యలు రావచ్చు. ఐరన్ లోపం ఉన్నప్పుడు శరీరం బలహీనపడి, నెలసరి సక్రమంగా రాకపోగా, క్రమం తప్పుతుంది. ఇందుకు రక్తహీనతను అధిగమించేలా బలమైన పోషకాహారాన్ని తీసుకోవాల్సిందే.

బీపీ, షుగర్, కుంగుబాటు, కడుపు సంబంధిత వ్యాధులున్నప్పుడు కూడా రుతుక్రమం దారి తప్పుతుంది. పేగులు ఆరోగ్యవంతంగా లేని మహిళల్లో పీరియడ్లు సరిగ్గా రావు.

థైరాయిడ్ గ్రంథి పనితీరుపై మహిళల రుతుక్రమం ఆధారపడి ఉంటుంది. థైరాయిడ్ లెవెల్స్ లో క్రమంగా జరిగే హెచ్చుతగ్గుల కారణంగా నెలసరి, బరువు, సంతానం కలిగే అవకాశాలు స్త్రీలపై ప్రభావం చూపుతాయి.

ఒబేసిటీ అనే సమస్యను మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఇలా అతిగా బరువు పెరగటం వల్ల నెలసరి క్రమం తప్పుతుంది. దీనికి కూడా హార్మోనల్ ఛేంజెస్ కారణం కావచ్చు లేదా జన్యుపరంగా విపరీతమైన బరువు ఉండవచ్చు. లావు పెరిగేకొద్దీ మానసిక ఒత్తిడి పెరిగి, పీరియడ్లు సరిగ్గా రావు. అతిగా బరువు ఉన్నప్పుడు కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ తక్కువ విడుదలవుతుంది, దీంతో నెలసరి దెబ్బతింటుంది.

 

Exit mobile version