Home Health రక్త హీనత వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి ?

రక్త హీనత వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఏంటి ?

0

క్తహీనత ఒక ఆరోగ్య సమస్య. సూటిగా చెప్పాలంటే, తగినన్ని ఆరోగ్యమైన ఎర్ర రక్త కణాలు లేకపోవడమే రక్తహీనత. దానికి వేర్వేరు కారణాలు ఉంటాయి. నిజానికి శాస్త్రవేత్తలు, 400 కన్నా ఎక్కువ రకాల రక్తహీనతలను కనుగొన్నారు. రక్తహీనత దీర్ఘకాలంగా ఉండవచ్చు, తాత్కాలికంగా ఉండవచ్చు, తీవ్రంగా ఉండవచ్చు, లేదా తక్కువ తీవ్రతలో ఉండవచ్చు.

రక్తహీనతరక్తహీనతలో, రక్తం యొక్క ఆక్సిజన్-వాహక సామర్థ్యం తగ్గిపోతుంది. అందువలన, ఈ మార్పుకు సంబంధించిన లక్షణాలు కూడా ఇలా ఉంటాయి:

బలహీనత:

బలహీనత భావన అనేది రక్తహీనత యొక్క అత్యంత సాధారణ లక్షణం మరియు ఏదైనా భారీ పని చేయకుండానే అలసట కలిగి ఉండటాన్ని గుర్తించవచ్చు.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం:

రక్తహీనత యొక్క అత్యంత గుర్తించదగ్గ లక్షణాలలో ఒకటి శ్వాస తీసుకోవడంలో కష్టoగా ఉంటుంది.

అసౌకర్య భావన:

రక్తహీనత కారణంగా కొన్నిసార్లు మీకు ఆరోగ్యంగా ఉన్న భావన కలుగకపోవచ్చు లేదా చెప్పలేని విధంగా అసౌకర్య భావన కలిగి ఉంటుంది.

మైకము:

ఒక్కోసారి మైకము కళ్ళుతిరిగి పడిపోవడం కారణంగా కూడా గాయం వంటి సమస్యలకు దారి తీయవచ్చు కాబట్టి మైకమును విస్మరించరాదు. ఇది మీ మెదడుకు తగిన ప్రాణవాయువు సరఫరా లేని కారణంగా ఇలా జరుగుతుంది.

పనితీరులో మార్పు:

మీరు ఇంతకు ముందు సులభంగా చేయగలిగిన వాటిని ఇప్పుడు చేయలేరు అలాగే మీరు ఎలాంటి వ్యాయామం కూడా చేయలేరు. ఏకాగ్రత చేయలేకపోవడం లేదా పనిలో దృష్టి పెట్టలేకపోవడం వంటివి ఉండవచ్చు

తలనొప్పి:

ఒక తలనొప్పి అనేది అనారోగ్యం యొక్క ఒక అరుదైన లక్షణం, ఇది తేలికపాటి నుండి మధ్యస్థ నొప్పికి కారణమవుతుంది.

పికా:

సున్నం, ఐస్ మరియు బంకమట్టి వంటి సామాన్యంగా తినదగని వస్తువులను తినడం లేదా తినాలి అనిపించడం. ఇది రక్తహీనతతో ఎక్కువగా సంబంధం కలిగి ఉంటుంది.

రక్త హీనతకు ముఖ్యంగా మూడు కారణాలు ఉన్నాయి:

  • రక్తం పోవడం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గిపోవడం.
  • తగినన్ని ఆరోగ్యమైన ఎర్ర రక్త కణాల్ని శరీరం తయారు చేయకపోవడం.
  • ఎర్ర రక్త కణాల్ని శరీరం నాశనం చేయడం.

ప్రపంచవ్యాప్తంగా చాలామంది, ఐరన్‌ లోపం వల్ల ఏర్పడే రక్తహీనతతోనే బాధపడుతున్నారు. శరీరానికి అవసరమైనంత ఐరన్‌ అందనప్పుడు తగినంత హిమోగ్లోబిన్‌ తయారు కాదు. హిమోగ్లోబిన్‌ ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది, శరీరంలో ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది.

అన్ని రకాల రక్తహీనతకు చికిత్స లేదా నివారణ లేదు. కాకపోతే ఐరన్‌ లోపం వల్ల గానీ, విటమిన్స్‌ లోపం వల్ల గానీ వచ్చే రక్తహీనతను తగ్గించాలన్నా, నివారించాలన్నా మనం తీసుకునే ఆహారంలో మార్పు తప్పనిసరి.ఎలాంటి పదార్థాలు తీసుకుంటే రక్త హీనతను తగ్గించుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

మాంసాహారం, బీన్స్‌, పప్పులు, పచ్చని ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇనుప పాత్రల్లో వండిన ఆహారంలో కూడా ఐరన్‌ శాతం ఎక్కువ ఉండవచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.

పండ్లు, పచ్చని ఆకుకూరలు, పచ్చి బఠానీలు, కిడ్నీ బీన్స్‌, చీజ్‌, గుడ్లు, చేపలు, బాదం పప్పు, వేరుశెనగల్లో ఫోలేట్ ఉంటుంది. విటమిన్స్‌ ఉన్న ధాన్యంతో చేసిన బ్రెడ్‌, పాస్తా, బియ్యం వంటి ఉత్పత్తుల్లో కూడా ఇది ఉంటుంది. ఫోలేట్‌ నుండి ఫోలిక్‌ ఆమ్లం వస్తుంది.

విటమిన్‌ బి-12 మాంసాహారం, పాల పదార్థాలు, ధాన్య ఉత్పత్తులు, సోయా ఉత్పత్తుల్లో ఉంటుంది. సిట్రస్‌ పండ్లు-వాటి రసాలు, మిరియాలు, బ్రోకొలి, టమాటాలు, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ వంటి వాటిలో ఉంటుంది. శరీరం ఐరన్‌ను గ్రహించడానికి విటమిన్‌ C సహాయం చేస్తుంది.

Exit mobile version