Home Unknown facts విష్ణువు పది అవతారాల నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు?

విష్ణువు పది అవతారాల నుండి మనం నేర్చుకోవలసిన విషయాలు?

0

ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణేతిహాసాల్లోనూ ఈ విషయం మనకు స్పష్టమౌతుంది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు.

విష్ణువు పది అవతారాలఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్క్రుతిలో భాగమే విష్ణువు పది అత్యంత ప్రసిధ్ద అవరోహణల్ని సమిష్టిగా దశావతారలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి.

మొదటి నాలుగు అవతారాలు సత్య యుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత మూడు అవతారాలు, త్రేతాయుగంలో, ఎనిమితో అవతారం ద్వాపర యుగంలో తొమ్మిదో అవతారం కలియుగంలో, పదోది కలియుగాంతంలో కనిపిస్తుందని అంచనా

“యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”

భారతంలో కృష్ణుడు అర్జునుడికి చెప్పిన శ్లోకం ఇది. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం ఎక్కువగా పెరిగిపోతున్నప్పుడు నన్ను నేను సృష్టించుకుంటాను. సత్పురుషులను పరి రక్షించడానికి, దుష్టులను రూపు మాపడానికి, ధర్మాన్ని సుస్థిరం చేయడానికి ప్రతి యుగంలో నేను అవతరిస్తాను. అవతరించడం, దుష్టసంహారం, సత్పురుశులను రక్షించడం వరకేనా? అంటే కాదు అనే చెప్పాలి. ఆయన ప్రతి అవతారంలోను రాబోయే యుగాలకు ఎన్నో మార్గదర్శకాలను చూపించాడు. ఇప్పటికి ఎప్పటికీ మనకు అవే మార్గాన్ని చూపిస్తాయి. వాటి అంతరార్ధాలు తెలుసుకుందాం…

మొదటిది మత్స్యావతారం :

చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో, అదేవిధంగా జీవితంలో ‘ప్రతికూల పరిస్థితుల్లో’నూ సంసారాన్ని ఈదాలి.

కూర్మావతారం :

తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో, అదేవిధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ‘ధ్యానం’ చేయాలి.

వరాహావతారం : వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో, అలాగే ‘ఇంటి బాధ్యత’లను మొయ్యాలి. 

నరసింహావతారం : మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి.

వామనావతారం :

మొదటి అడుగు భౌతికంగానూ, రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ, మరి మూడవ అడుగును మనలోని ‘అహంకారాన్ని’ గుర్తించి ‘బలి’ ఇవ్వాలి.

పరశురామావతారం : లక్ష్యం’ కోసం పట్టుదలతో ముందుకెళ్లాలి.

రామావతారం : ‘ధర్మ’యుతంగా జీవించాలి.

కృష్ణావతారం: ఎన్ని కష్టాలు ఎదురైనా ‘ఆనందం’గా ఉండాలి.

బుద్ధావతారం : ‘జ్ఞానాన్ని’ పంచాలి.

కల్కి అవతారం : సకల మానవాళి ‘అజ్ఞానాన్ని దూరం చేయాలి.

Exit mobile version