Home Health డయాబెటీస్ కి బేకింగ్ సోడాకి సంబంధం ఏంటి? 

డయాబెటీస్ కి బేకింగ్ సోడాకి సంబంధం ఏంటి? 

0

మీరు ఎప్పుడైనా ఇంట్లో బజ్జిలు చేసుకున్నారా…? అందులోకి ఏమేం వాడారు? కచ్చితంగా బేకింగ్ సోడా అయితే వాడే ఉంటారు కదా..! మీరే కాదు ఎవరైనా బజ్జిలు చేసుకుంటున్నారు అంటే అందులో కచ్చితంగా బేకింగ్ సోడా వాడాల్సిందే. కేవలం బజ్జిలే ఏ ఇతర వంటకాలైన బేకింగ్ సోడా వాడుకోవచ్చు. కొన్ని ఆహార పదార్ధాల తయారీలో గుల్లబారి మృదువుగా వస్తాయని వంట సోడాని ఉపయోగిస్తారు. దీనిని ఇంట్లో చేసే వంటల కంటే బేకరీ ఉత్పత్తుల్లోనే ఎక్కువగా వాడుతుంటారు. పలు స్వీట్స్, కేకుల తయారీలో కూడా  ఉపయోగిస్తుంటారు. అయితే ఈ బేకింగ్ పౌడర్ కేవలం వంటలకే కాదు, పలు అనారోగ్య సమస్యల్ని కూడా నివారిస్తుందంటున్నారు ఆహార నిపుణులు.

  • బేకింగ్ సోడా అంటే సోడియం బైకార్బొనేట్ అనే ఒక రసాయన పదార్థం. దీనిని మనం వాడుక భాషలో బేకింగ్ సోడా అంటాం. ఎక్కువ తిన్నా, సరిగ్గా అరక్కపోయినా, గుండెల్లో మంటగా అనిపిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఆ మంట పొట్టలో నించి గొంతు వరకూ తెలుస్తుంది. ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ఆ మిశ్రమాన్ని నెమ్మదిగా తాగితే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది. బేకింగ్ సోడాను మ‌నం రోజు వాడుతునే ఉంటాం. దాంతో శ్వాస‌లో తాజ‌ద‌నం వ‌స్తుంది. అలాగే మ‌న దంతాలు తెల్ల‌గా మారుతాయి.

  • అయితే మ‌నం వాడే బేకింగ్ సోడాకు డయాబెటీస్ కు మ‌ధ్య‌ సంబంధం ఉంటుందా అంటే అవున‌నే అంటున్నారు నిపుణులు. అది ఎలాగంటే డయాబెటిస్ ఉన్న‌వాళ్లు ఆ వ్యాధిని స‌రైన స‌మ‌యంలో గుర్తించ‌క‌పోతే అది డయాబెటిక్ కెటోయాసిడోసిస్‌గా మారే అవ‌కాశం ఉంది. ఇలా జ‌రిగితే అది మ‌న ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం.ఈ బేకింగ్ సోడా రక్తంలోని పీహెచ్ స్థాయిని ఎక్కువ‌గా పెంచుతుంద‌ట‌. అలాగే మ్యూకోర్ మైకోసిస్, డీకేఏ చికిత్సలో బేకింగ్ సోడా వాడకం గురించి కూడా ప‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.
  • అయితే డయాబెటిస్ చికిత్సలో బేకింగ్ సోడా ప్రభావాలపై ఇప్ప‌టికైతే జంతువుల మీదే ప‌రిశీలించారు. ఈ ప‌రిశోధ‌న ఇంకా మ‌నుషుల మీద జ‌ర‌గ‌లేదు. కానీ ఈ జంతువులపై చేసిన రీసెర్చ్ లో ప‌లు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. బేకింగ్ సోడా వాడకం వ‌ల‌న‌ మ్యూకోర్ మైకోసిస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని తెలుస్తుంది. డీకేఏ ఉన్న రోగులు వారి రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచితే.. ఇది కణాలకు నష్టం కలిగిస్తుందని తేలింది. ఇందులోని సోడియం బైకార్బోనేట్ ఫంగస్ పెరుగుదలను ఆపుతుంది. దీంతో సంక్రమణను నివారించడంలో సాయం చేస్తుంద‌ని తేలింది.
  • డబాయబెటిస్ ఉన్నవారికి మాత్రమే కాదు బేకింగ్ సోడాతో ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసి దానికి తగినంత నిమ్మరసం చేర్చి పరగడుపున తాగాలి. అరగంట వరకు ఏమీ తినకుండా ఉండాలి. ఇలా కొంత కాలం చేస్తే శరీరంలో ఉన్న ఫ్యాట్ కరుగుతుంది.
  • కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఈ పౌడర్‌కి వుంది. ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి తాగాలి. ఈ విధంగా రోజూ తాగుతున్నట్లయితే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి.  అంతే కాకుండా పాదాల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి. ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా కలిపి ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు సమస్యలు తగ్గిపోతాయి.
  • శరీరం పై ఏదైనా పురుగు పాకినా, లేదా కుట్టినా ఆ ప్రాంతంలో దురద, నొప్పి, మంట వంటివి వుంటాయి. దీన్ని తొలగించుకోవడానికి కూడా బేకింగ్ పౌడర్ పని చేస్తుంది. ఒక స్పూన్ బేకింగ్ పౌడర్‌కి కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లాగా చేసి ఆ ప్రాంతంలో రాయాలి. నిదానంగా నొప్పి, మంట అన్నీ తగ్గుముఖం పడతాయి.
  • క్యాన్సర్ ని తగ్గించడంలోనూ బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నీటిలో బేకింగ్ సోడా కలుపుని తీసుకోవడం మూలంగా కణితి పెరుగుదల మరియు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని ధృవీకరిస్తున్నారు. బేకింగ్ సోడా క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని వాటిని తగ్గుముఖం పట్టించడంలో సహాయపడగలదని ఒక కొత్త అధ్యయనంలో తేలింది. ఇది సులభంగా ప్రభావానికి గురైన కణాలను గుర్తించడం మరియు వాటి పెరుగుదలను తగ్గించడం ద్వారా కణితి కణాలను నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది.

Exit mobile version