Home Health జ్వరంతో ఉన్నపుడు నాన్ వెజ్ తినొద్దు అనడానికి గల కారణం

జ్వరంతో ఉన్నపుడు నాన్ వెజ్ తినొద్దు అనడానికి గల కారణం

0

జ్వరం వచ్చినప్పుడు ఇమ్మ్యూనిటి పవర్ బాగా తగ్గిపోతుంది. కొంతమందికి బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా పడిపోతుంటాయి. జ్వరం వచ్చినప్పుడు తినే ఆహరం కూడా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే జ్వరం వచ్చిన వాళ్ళు తీసుకునే ఫుడ్ విషయంలో అనేక ఆంక్షలు పడుతుంటారు. ఇలాంటి వారు అధికంగా ఫుడ్ తీసుకున్నా ఇబ్బందే. ముఖ్యంగా జ్వరంతో ఉన్న వారు నాన్ వెజ్ తీసుకోవచ్చా అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. దానికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Feverజ్వరంతో ఉన్న సమయంలో అసలు నాన్ వెజ్ వద్దు అంటున్నారు వైద్యులు. చికెన్, మటన్, చేపలు రొయ్యలతో పాటు నాన్ వెజ్ ఫుడ్ ఏదీ తీసుకోవద్దు అని చెబుతున్నారు. మరి కోడి గుడ్డు తీసుకోవచ్చా అంటే… ఎలాంటి భయం లేకుండా కోడి గుడ్డు తీసుకోవచ్చట. కోడిగుడ్లలో ఉండే పోషకాలు ముఖ్యంగా ప్రోటీన్లు జ్వరం వచ్చిన వారికి ఎనర్జీ ఇస్తాయి. దాంతో ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.

అయితే కోడిగుడ్లను ఆమ్లెట్ లా మాత్రం తీసుకోవద్దు.. కేవలం ఉడకబెట్టిన కోడి గుడ్డు మాత్రమే తీసుకోవాలి. అది కూడా ఆకలి వేస్తేనే తినాలి అంతేకాని ఆకలి లేకపోయినా తీసుకోవద్దు. అందులోనూ బాగా ఉడకబెట్టిన కోడి గుడ్డు మాత్రమే తీసుకోవాలి అని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే ఇందులో సాల్మొనెల్లా ఉంటుంది ఉడకబెట్టకపోతే జ్వరం మరింత పెరుగుతుందట.

 

Exit mobile version