Home Health హార్మోన్ అసమతుల్యత అంటే ఏంటి? సమతుల్యం చేసే ఆహారాలేంటి?

హార్మోన్ అసమతుల్యత అంటే ఏంటి? సమతుల్యం చేసే ఆహారాలేంటి?

0
ప్రస్తుతకాలంలో మారుతున్న జీవనశైలి మనం మన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే సమయాన్ని ఇవ్వడం లేదు. మరోపక్క ఆహారపు అలవాట్లు సైతం మారిపోతున్నాయి. కూరలు, పండ్లు తినే వారి సంఖ్య తగ్గి, పిజ్జాలు, బర్గన్‌లు ఇష్టపడే వారి సంఖ్య పెరిగింది. ఈ క్రమంలోనే హార్మోన్లు  ప్రభావితం అవుతున్నాయి. కానీ మనిషి జీవించటానికి శ్వాస ఎంత ముఖ్యమో మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు అంతే ముఖ్యం. గర్భాశయంలో పిండముగా ఏర్పడినప్పటి నుంచి మనిషి కాలం తీరేంతవరకు కూడా శరీరం మీద హార్మోన్ల ప్రభావము ఉంటుంది.
శరీరంలోని ఒక కణము నుంచి మరొక కణానికి రసాయనిక సమాచారం అందజేసే, సంకేతాలను తెలిపే కెమికల్స్‌ను హార్మోన్లు అంటారు. హార్మోన్లు పాలిపెప్టైడ్‌తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలో ఒక ప్రాంత కణజాలం, అవయవాల నుంచి ఉత్పత్తి అయి, వివిధ శరీర భాగాలకు రక్తం ద్వారా ప్రవహించి నిర్ధిష్ట అవయవాలను ప్రభావితం చేసి జీవప్రక్రియల సమతుల్యతకు తోడ్పడతాయి.
మెదడు భాగంలోని హైపోథాలమస్‌ మరియు పిట్యూటరి గ్రంధి హార్మోన్ల ఉత్పత్తికి దోహదపడి శరీరంలోని కణాల క్రమబద్ధతకు ప్రాముఖ్యత వహిస్తాయి. ఈ హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతను, ఆకలిని, మానసిక స్థితిని, నిద్రను, దాహము, కామక్రోధమును అదుపులో ఉంచుతాయి. ఈ మధ్యకాలంలో హైపోథైరాయిడ్‌, సిసిఒడి, సంతానలేమి, డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక జబ్బులన్నీ హార్మోన్‌ అసమతుల్యత వల్ల వచ్చేవే. చాలా రకాల హార్మోన్లు మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి.
ఈ హార్మోన్ల సమతుల్యం దెబ్బతిన్నప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతారు. ఈ హార్మోన్లు ఎండోక్రైన్‌, ఎక్సోక్రైన్‌ గ్రంధుల నుంచి ఉత్పత్తి అవుతాయి. శరీరంలో ఇవి సూక్ష్మమోతాదులో ఉత్పత్తి అయినప్పటికీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్‌ హార్మోన్ల టి3, టి4 ఇవి థైరాయిడ్‌ గ్రంధి నుంచి ఉత్పత్తవుతాయి. వాటి అసమతుల్యత వల్ల హైపోథైరాయిడ్‌, హైపర్‌థైరాయిడ్‌, గాయిటర్‌ అనే దీర్ఘకాలిక జబ్బులు వస్తాయి.
స్త్రీలలో హార్మోన్స్‌ సమస్యలు
ఈస్ట్రోజన్‌, ప్రొజెస్టిరాన్‌, ప్రొలాక్టిన్‌, ఆక్సిటోసిన్‌ హార్మోన్లు స్త్రీలలో నెలసరి, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవంలో ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్ర్తీలలో నెలసరి సమస్యలు, అవాంచిత రోమాలు, సంతానలేమి, సమస్యలు వస్తాయి. స్రీలలో మెనోపాజ్‌, నెలసరి వచ్చే సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల వేడి ఆవిర్లు, మానసిక అశాంతి, నీరసం కీళ్లనొప్పులు వస్తాయి.
 ప్రకృతి సహజంగా కావాల్సిన రుతు క్రమంలో దీని వల్ల మార్పులు జరుగుతున్నాయి. ఫలితంగా ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు, అధిక బరువు పెరడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి.
పురుషుల్లో హర్మోన్‌ సమస్యలు
మగవారిలో ముఖ్యంగా టెస్టోస్టిరాన్‌ అనే హార్మోన్‌ ఉత్పత్తి అయి ఎముకల సాంద్రతకు, కండరాల పటుత్వానికి, వీర్యకణాల వృద్ధికి దోహద పడుతుంది. ఈ టెస్టోస్టిరాన్‌ లోపం వల్ల సెక్స్‌ప్రోబ్లమ్స్‌, కండరాల పటుత్వం తగ్గిపోవటం, డిప్రెషన్‌, టైప్‌ 2 డయాబెటిస్‌ అంతేకాక ఎల్‌హెచ్‌ మరియు ఎఫ్‌ఎస్‌హెచ్‌ డెఫీషియెన్సీ వలన హై పోగొనాజిజమ్‌ వచ్చే అవకాశం ఉంది. టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ అసమతుల్యత వల్ల శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, వీర్యకణాల లోపాలు, సంతానలేమి సమస్యలు వస్తాయి. పిల్లల బరువు, ఎత్తు, ఎదుగుదల సమస్యలు వస్తాయి.
మహిళలకు అత్యవసరమైన హార్మోన్లను సమన్వయం చేయడంలో పుట్టగొడుగులు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఉత్పత్తిలో సాయపడతాయి. ఇది మెనోపాజ్‌ దశలో మహిళలకు హృద్రోగం వంటి అనారోగ్యాలు రాకుండా పరిరక్షిస్తాయి. అలాగే క్రమం తప్పే నెలసరిని సరిచేస్తాయి.
అధిక రక్తస్రావం, పెల్విక్‌ భాగంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. ఆ సమయంలో వచ్చే చికాకు, మూడ్‌ స్వింగ్స్‌, ఆందోళన, ఒత్తిడి వంటివాటిని దరి చేరనివ్వవు. హార్మోన్ల లోపం వల్ల వచ్చే పాలిసిస్టిక్‌ ఓవరీ సిండ్రోమ్‌ (పీసీఓఎస్‌)తో ఎదురయ్యే అవాంఛిత రోమాలు, చర్మంపై వచ్చే నల్లని మచ్చలు, మొటిమలు వంటి సమస్యలను నిరోధిస్తాయి. అంతేకాదు, ఎండోమెట్రియాసిస్‌ సమస్యతో గర్భాశయంలో వచ్చే పలురకాల అనారోగ్యాలనూ తగ్గిస్తాయి.
ప్రతీరోజు మొలకెత్తిన గింజలను తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా జబ్బుల బారిన పడకుండా ఉండవవచ్చని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు.  మొలకలను  చిన్నా, పెద్దా అందరూ తినవచ్చు. ఉదయం అల్పాహారంగానూ, మధ్యాహ్నం స్నాక్స్‌గా కూడా వీటిని తీసుకోవచ్చు. ఈ మొలకలలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. మొలకలొచ్చిన గింజలను తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
మొలకెత్తిన గింజల్లో శరీరానికి అవసరమయ్యే ఓమేగా 3 ఫాటి ఆసిడ్స్‌,ఫైబర్‌, కాల్షియం,  జింక్‌, ప్రోటీన్స్‌,నీరు, విటమిన్‌ సి లభిస్తాయి. గుండె సంబంధిత అనారోగ్యాలను నివారిస్తూ, గుండె ఆరోగ్యాన్నికాపాడుతుంది . ఇవి త్వరగా జీర్ణమవుతాయి. మొలకలు మలబద్ధకాన్ని పోగొడతాయి. ప్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. హార్మోన్లను సమతుల్యం కి మొలకెత్తిన గింజలు బాగా ఉపయోగపడతాయి.
శనగలు, పెసలు, అలచందలు, వేరుశెనగపప్పులు లాంటి గింజ ధాన్యాలను నీటిలో నానేసి, వాటికి మొలకలు వచ్చిన తర్వాత అలాగే తినవచ్చు.లేదా ఇంకారుచి పెంచుకోవడం కోసం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిన్న చిన్న గా  తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర వాటిల్లో కలిపి, కొంచెం  ఉప్పు వేసి తింటే బావుంటాయి. కొంతమంది మొలకగింజలను ఉడికించి, వాటికి తాలింపు పెట్టి తింటారు.

Exit mobile version