వేసవిలో ఎండా వేడి ఎక్కువగా ఉండడం వల్ల చాలామందికి డీహైడ్రేషన్ వస్తూ ఉంటుంది. అసలు డీ హైడ్రేషన్ అంటే ఏంటి? దాన్ని ఎలా గుర్తించాలి ఇప్పుడు తెలుసుకుందాం.మన శరీరంలో నీరు దాదాపుగా 60% వుంటుంది. ఎండలో తిరిగినప్పుడు, వాంతులు విరేచనాలు వచ్చినప్పుడు మన శరీరంలో నీటి పరిమాణం గణనీయంగా తగ్గుతుంది. దీనినే డీ హైడ్రేషన్ అంటాము.
నోరంతా పొడిబారినట్లు, నాలుక తడారిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు డీ హైడ్రేషన్ ఉన్నట్లు గుర్తించాలి.
తీవ్రమైన అలసట, ఎక్కువగా నిద్ర పోవాలనే కోరిక ఇవి కూడా డీహైడ్రేషన్ లక్షణాలు.
తలనొప్పితో కూడా ఎక్కువ బాధ పడుతున్నప్పుడు డీహైడ్రేషన్ కి గురి అయినట్లు గుర్తించాలి.
చర్మము సహజ స్వభావాన్ని కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్ సమస్య ఉన్నట్లు గుర్తించి. నీళ్లు బాగా తాగాలి.
వీటిని అధిగమించటానికి తగినంత నీటిని తీసుకోవాలి. వాటితో పాటుగా ఎలక్ట్రోలేట్ లాంటి ఓరల్ సప్లిమెంట్స్ ను తీసుకోవాలి. దాంతో డీహైడ్రేషన్ ను అధిగమించవచ్చును.