కుజ గ్రహానికి, అంగారకుడని, మంగళుడు అనే పేర్లు ఉన్నాయి. అలాగే కుజుడు భూమి పుత్రుడు అని కూడా పురాణ కథనం. ఒక సారి కుజుడు తన తల్లి తండ్రుల అనుమతి తీసుకోని నర్మదా నది తీరంలో నిరాహారంగా 1000 సంవత్సరాలు గణపతి గురించి తపస్సు చేశాడట. అలా 1000 సంవత్సరాలు కుజుడు తపస్సు చేసిన తరువాత మాఘ బహుళ చవితి చంద్రోదయం నాడు దశా భుజాలు కలిగిన బాలుడి రూపంలో వినాయకుడు ప్రతక్ష్యమయ్యాడు.
అప్పుడు అంగారకుడు తో నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏ వరం కావాలో అని కోరుకొమ్మన్నాడు వినాయకుడు. దానికి అంగారకుడు ఎంతో సంతోషించి ఆ వినాయకుడిని ఎన్నో విధములుగా స్తుతించి… తనకు అమృతం కావాలని, అదే విధంగా నేను ఎప్పడు నీ నామ స్మరణ చేస్తుండెలా వరమియమని కోరుకొన్నాడు.
అప్పుడు వినాయకుడు తదాస్తు అని దీవించి ,నీవు ఎర్రని రంగులో ఉన్నావు ఎర్రని వస్త్రం కట్టుకోన్నావు, ఈ దినం మంగళవారం కనుక ఇక నుంచి నీ పేరు మంగళుడు అని వరం ఇచ్చి వినాయకుడు అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత అంగారకుడికి అమృతం ప్రాప్తిస్తుంది. అమృతం సేవించిన తరువాత కుజుడు ఒక ఆలయం కట్టించి అందులో వినాయకుడిని ప్రతిష్టించి, ఆ వినాయకుడికి శ్రీ మంగళమూర్తి అని పేరు పెట్టాడు. ఈ ఆలయం ఇప్పటికి మన భారత దేశంలో ఉంది.
వినాయకుడు కుజుడికి ఇంకొ వరం కూడా ప్రసాదించాడు. ఎవరైతే అంగారక చతుర్ధి రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని భక్తి శ్రద్దలతో పూజచేస్తారో వారికి ఉన్న కుజగ్రహ దోషాలు అన్ని తొలగిపోతాయని వరం ప్రసాదించాడు.
ఈ పూజా చేసిన వారికి ఒక సంవత్సరం సంకష్టి వ్రతం అంటే ఒక్కొక్క నెలలో ఒక్కో చతుర్ద్ది నాడు చొప్పున 12 నెలలు వ్రతం చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలం వస్తుందో ఈ ఒక్క అంగారక చతుర్ధి రోజున చేసే వినాయకుడి వ్రతం వల్ల అంతటి కలుగుతుంది. అలాగే అన్ని దోషాలు,ముఖ్యంగా కుజ దోషాలు సంపూర్ణంగా నివారించాబడతాయి.