Home Unknown facts శ్రీ కాళహస్తి క్షేత్రంలో వెలసిన కన్నప్ప గుడి వెనుక పురాణ కథ ఏంటి ?

శ్రీ కాళహస్తి క్షేత్రంలో వెలసిన కన్నప్ప గుడి వెనుక పురాణ కథ ఏంటి ?

0

తెలుగు దేశంలో గల ప్రాంగణంనందు” ఉడుమూరు` అనే బోయపల్లె ఉంది. అక్కడ నాధనాధుడు-తండే అను బోయ దంపతులకు శివానుగ్రహం చేత మగ శిశువు జన్మించాడు. ఆ బాలునికి తిన్నాడు అని పేరు పెట్టారు. అతడు విల్లు విద్యలో దిట్ట అయ్యాడు. ఒక రోజు అతను వేటాడి అలసిపోయి చెట్టు క్రింద నిద్రించే సమయంలో శివుడు సాక్షాత్కారించి ఇలా అన్నాడు.ఇక్కడ కొండ దగ్గర మొగలేటి ఒడ్డున శివుడు ఉన్నాడు.పోయి అతనిని దర్శించుకో అని చెప్పాడు. వెంటనే మేల్కొని చూస్తే ఒక అడవి పంది కనిపించింది. ఆ పందిని వేటాడుకుంటూ దాని వెంట పడగాఅది తిరిగి తిరిగి శివుడుఉన్నచోటికి అతన్ని తీసుకువచ్చింది.

కన్నప్పఅప్పుడు తిన్నాడు ఆ చోటనే శివుని చూసి నిలిచిపోయి తన్మయుడై శివుని చాల విధాలుగా తన ఇంటికి రమ్మని వేడుకున్నాడు. కాని శివుడు మాత్రం ఒప్పుకోలేదు. అయితే ప్రతిరోజు నిద్ర లేవగానే అడవికి వెళ్లి పందిని వేటాడి చంపి,కాల్చి మాంసం రుచి చూసి ,రుచి ఉన్న దానిని ఆకు దొప్పల యందుఉంచుకొని ఫల,పుష్ప,బిల్వదళంబులను వీపులో దాచుకొని నోటితో తెచ్చిన గంగతో శివునికి అభిషేకం చేసి,ఆకుదోప్పలతో తెచ్చిన మాంసాన్ని మహా నైవేద్యంగా శివుడిని తిన్నాడు సమర్పించేవాడు.

అదే సమయంలో సంపన్నుడు ,శ్రేష్ఠుడు అయిన బ్రాహ్మణుడు కుడా వచ్చి స్వామిని ప్రతి దినం అర్చించి పోయేవాడు. చాలాకాలం నుండి పూజిస్తున్న ఆ బ్రాహ్మణునికి కొత్తగా పూలు, ఎంగిలి మాంసం అమంగళంగా కనపడింది. దానికాతడు విచారించి ” స్వామి నీ ఆలయం ఇటివల కొన్ని రోజులుగా ఈ విధంగా రోతగా మారటానికి కారణం ఏంటి అని మరి మరి వేడుకొని అడిగాడు. సమాధానం చెప్పకపోతే ప్రాణాలు తీసుకుంటా అని అంటాడు. అప్పుడు స్వామి ఒక చెంచు వాడు ఈ విధంగా పూజచేస్తున్నాడు.అతను గొప్ప భక్తుడు, అతని భక్తి శ్రద్ధలు నువ్వు కూడా చూడు అని అతనిని తన వెనుక భాగంలో దాక్కోని అంత గమనించమని చెప్తాడు.

కొంతః సేపటికి తిన్నాడు యధాప్రకారంగా వచ్చి స్వామికి అభిషేకం చేసి తాను తెచ్చిన మాంసమును తిను అని అంటాడు. కాని స్వామి తినలేదు.ఇంతలో స్వామికి ఒక కన్ను వెంట నీరు కారటం మొదలవుతుంది. క్రమంగా అది ఎక్కువవడం తిన్నాడు గమనించి స్వామికి కంటి జబ్బు వచ్చిందని చాలా భాధపడతాడు. వైద్యం చేసి నయం చేయాలనీ చూస్తాడు. గుడ్డను చుట్టగా చుట్టి నోటి ఆవిరి పెట్టి కంటికి అద్దుతాడు. నిమ్మరసం వేసినాడు. కలువ పూలు తెచ్చి కంటికి రుద్దాడు. అడవి అంతా తిరిగి వెతికి వెతికి ఎన్నో మూలికలు తెచ్చి వేసాడు కానీ ప్రయోజనం లేకపోయింది. కంటి నుండి రక్తం కుడా కారడం ప్రారంభమయింది. చివరకు కంటికి కన్నే మందు అని అనుకోని తనకంటినొక దానిని తీసి స్వామి కంటిఫై అంటి పెట్టాడు. దానితో స్వామి కన్ను కొంచం బాగయింది. ఈ కొత్త కన్ను ముందు కంటికన్నా చాలా ప్రకాశంగా కనబడింది. కాని వెంటనే రెండోవ కంటి నుండి రక్తం కారడం మొదలయింది.

అప్పుడు తిన్నాడు ఒక నవ్వు నవ్వి ఓ స్వామి నీ దయచేత రెండవ కంటికి కూడా మందు ఉంది అని కాలితో రక్తం కారుతున్న స్వామి వారి రెండోవ కంటి గుర్తుకై తన కాలి బొటన వేలును అదిమిపెట్టి తన రెండోవ కంటిని తీయబోయాడు. వెంటనే శివుడు తిన్నాడి భక్తి పారవశ్యంకు మెచ్చి సతీ సమేతుడై ప్రతక్ష్యమై తిన్ననికి,ఆ బ్రాహ్మణునికి శివుడి లోపల ఐక్యం చేసుకున్నాడు. ఆనాటి నుండి తిన్నాడు శివునకు కన్నిచ్చిన కారణంగా కన్నప్ప అను పేరు వచ్చి లోకులకు భక్తిమార్గం చూపించేవాడుగా శ్రీ కాళహస్తి క్షేత్రంలో భక్త శిరోధార్యంమై ఉన్నాడు. దేవాలయంకు దక్షిణపు వైపున ఉన్న పర్వతం ఫై కన్నప్ప గుడి ఉంది. ఇప్పటికి భక్తులు ఆ కొండ ఎక్కి భక్తుడైన కన్నప్పను దర్శించుకుంటున్నారు.

 

Exit mobile version