Home Health ఓవులేషన్ జరిగే ముందు శరీరంలో కనపడే సూచనలు ఏంటో తెలుసా ?

ఓవులేషన్ జరిగే ముందు శరీరంలో కనపడే సూచనలు ఏంటో తెలుసా ?

0

పెళ్లి తరువాత సంవత్సరం తిరక్కుండానే కొంతమంది పిల్లల్ని కంటారు. కొంతమందికి పిల్లలు పుట్టడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఏ సమయంలో కలిస్తే పిల్లలు పుడతారు, ఎప్పుడు దీనికి అనువైన సమయం అనేది కొందరికి అవగాహన ఉండదు. దీనిపై వైద్యులు ఇచ్చే సలహాలు ఏంటో తెలుసుకుందాం.

ovulation periodసాధారణంగా ఓవులేషన్ పీరియడ్ లో కలిస్తే ప్రెగ్నన్సీ వస్తుంటుంది. కానీ అసలు ఈ ఓవులేషన్ పీరియడ్ అంటే ఏంటో చాల మందికి తెలియదు. ఓవరీస్ నుండి ఎగ్ రిలీజ్ అవ్వడాన్నే ఓవులేషన్ అంటారు. ఇది నెల నెలా కరెక్ట్‌గా సైకిల్ మధ్యలో జరుగుతుంది. అంటే మీ లాస్ట్ పీరియడ్‌కి పద్నాలుగు రోజుల తరువాతా, తరువాత పీరియడ్ కి పధ్నాలుగు రోజుల ముందూ జరుగుతుంది.

ఉదాహరణకి అమ్మాయికి డేట్ ఫిబ్రవరి 1న వచ్చింది అంటే ఫిబ్రవరి 14న ఓవిలేషన్ పిరియడ్. ఈ టైమ్ లో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఎక్కువ. ఇక ఈ సమయంలో పురుషుడి స్పెర్మ్ స్త్రీ శరీరంలోకి వెళితే ఆమె ఎగ్ రిలీజ్ అయ్యేవరకూ అక్కడ కొద్ది రోజులు శుక్రకణాలు ఉంటాయి.. ఇలా 2 కలిసిన సమయంలో ప్రెగ్మెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే 11వ తేది నుంచి 20 వ తేది వరకూ కలిస్తే ఆ పదిరోజుల కలయికతో ప్రెగ్నెన్సీ రావచ్చు.

అయితే, ఇలా జరిగేది కేవలం మీది ఇరవై ఎనిమిది రోజుల సైకిల్ అయితే మాత్రమే. మిగిలిన సందర్భాల్లో ఐదారు రోజులు అటూ ఇటూగా జరగవచ్చు. స్త్రీ ఫెర్టైల్ గా ఉండే సమయం ఇదే. ఈ టైమ్ లో కలిస్తే గర్భం ధరించే అవకాశం ఎక్కువ. ఓవులేషన్ జరిగే ముందు స్త్రీ శరీరం లో కొన్ని సూచనలు కనబడతాయి, వాటిని గమనించుకుంటూ ఉంటే ఒక అంచనాకి రావడానికి వీలుగా ఉంటుంది.

కొంత మంది స్త్రీలు ఓవులేషన్ జరిగే సమయం లో పెయిన్ ని ఎక్స్పీరియెన్స్ చేస్తారు. ఓవరీ నుండి ఎగ్ రిలీజ్ అయినప్పుడు కొంత పెయిన్ ఉండవచ్చు. కొంత మందికి ఈ పెయిన్ అసలు తెలియకపోవచ్చు, కొంత మందికి లైట్ గా అనిపించవచ్చు, కొంత మంది కి తీవ్రం గా నొప్పి రావచ్చు. అందరికీ ఇది జరుగుతుందని చెప్పలేం.

బాడీ టెంపరేచర్ ని బట్టి కూడా ఓవులేషన్ సమయాన్ని తెలుసుకోవచ్చు. ప్రతి రోజూ పక్క మీద నుండి లేవకుండా టెంపరేచర్ చెక్ చేసుకుంటే ఓవులేషన్ జరిగే సమయం తెలిసిపోతుంది. ఈ టెంపరేచర్ ని రోజులో ఇతర సమయాల్లో ఉన్న టెంపరేచర్ తో చెక్ చేసుకోవాలి. ఓవులేషన్ జరిగే సమయంలో ఈ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. అయితే, ఈ టెంపరేచర్ చెక్ చేసుకోవడమన్నది రోజూ పొద్దున్న ఒకే సమయంలో బాత్రూంకి కూడా వెళ్ళక ముందే చెక్ చేసుకోవాలి.

 

Exit mobile version