Home Unknown facts గంగిరెద్దుల ఆచారం ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏంటి ?

గంగిరెద్దుల ఆచారం ఎలా వచ్చింది దాని వెనుక ఉన్న కథ ఏంటి ?

0

సంక్రాంత్రి వచ్చిందంటే పల్లెటూళ్లలో వీధివీధి గంగిరెద్దుల సందడి కనిపిస్తుంటుంది. హరిదాసుల పాటలు, గంగిరెద్దుల ఆటలు పండగను ఇంటి ముందుకు తీసుకొస్తాయి. అయితే ఈ గంగిరెద్దుల ఆచారం ఎలా వచ్చిందో, దాని వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం.

Gangiredduపూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు ఘోర తపస్సుతో మహా శివుడిని మెప్పించి జంగమయ్య లింగమై తన కడుపులో ఉండేలా వరాన్ని కోరుకున్నాడు. అప్పుడు లోకాలను రక్షించే శివుని బయటకు రప్పించేందుకు విష్ణుమూర్తి ఓ ఉపాయం ఆలోచించాడు.

దేవతలంతా తలా ఓ వాయిద్యాన్నీ పట్టుకుని, నందితో కలిసి గజాసురుడి దగ్గరకు బయల్దేరారు. వీళ్ల ప్రదర్శనకు మెచ్చుకున్న గజాసురుడు ఏదన్నా వరాన్ని కోరుకొమ్మని అడిగాడు. దాంతో తన పొట్టలో ఉన్న శివుడిని బయటకు పంపమని వరాన్ని అడిగేశారు. అలా ఆనాడు శివుని పొందేందుకు చేసిన హడావుడే, ఇప్పటి గంగిరెద్దుల సంప్రదాయానికి నాంది అని చెబుతారు.

సంక్రాంతితో పాటు ఇంటింటా అడుగుపెట్టే హరిదాసుకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. సంక్రాంతికి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే, హరిదాసు రూపంలో మన ఇంటికి వస్తాడట. ఆయన తల మీద ఉండే పాత్ర, ఈ భూమికి చిహ్నమని చెబుతారు. అందుకే ఆ పాత్రని హరిదాసులు నేల మీద పెట్టరు. భిక్ష పూర్తయ్యి ఇంటికి చేరుకున్నాకే దాన్ని కిందకి దించుతారు.

కనుమ రోజు పశువులని పూజించడం వెనుక కూడా ఓ కథ వినిపిస్తుంది. ఒకసారి శివుడు నందిని పిలిచి ‘భూలోకంలో అందరూ రోజూ ఒంటికి నూనె పట్టించి స్నానం చేయాలి, నెలకి ఓసారే ఆహారం తీసుకోవాలి’ అని చెప్పి రమ్మన్నాడు. కానీ నంది అయోమయంలో ‘రోజూ ఆహారం తీసుకోవాలి, నెలకి ఓసారి నూనె పట్టించి స్నానం చేయాలి’ అని చెప్పిందట.

దాంతో కోపం వచ్చిన శివుడు. ‘ప్రజలు రోజూ తినాలంటే చాలా ఆహారం కావాలి. ఆ ఆహారాన్ని పండించేందుకు నువ్వే సాయపడాలి’ అని శపించాడు. అప్పటి నుంచి ఎద్దులు, వ్వవసాయంలో సాయపడుతున్నాయట. కనుమ రోజు పశువులని సాక్షాత్తు నందీశ్వరులుగా భావించి పూజిస్తుంటారు.

 

Exit mobile version