Home Unknown facts సంక్రాంతి పండుగ వెనుక పురాణా గాథలు గురించి తెలుసా ?

సంక్రాంతి పండుగ వెనుక పురాణా గాథలు గురించి తెలుసా ?

0

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటాము. సంక్రాంత్రి మూడురోజుల పండుగ. ప్రస్తుత రోజుల్లో సంక్రాంతి అంటే అందరూ బోగిపండ్లు, పిండివంటలు, ముగ్గులు, గాలిపటాలు అనే భావిస్తారు. కానీ అసలు ఈ పండుగ వెనుక పురాణాల్లో పలు గాథలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

సంక్రాంతిసంక్రాంతి అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు.

ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించింది.

ఇక సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఓ కథ ఉంది. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

 

Exit mobile version