ఏ వంట చేయాలన్నా ముందుగా కావాల్సింది నూనె. నూనె లేకుండా వంట చేయలేం. చేసినా టేస్ట్ ఉండదు. వంటల్లో వాడే కంపల్సరీ ఇంగ్రెడియెంట్గా నూనె మారిపోయింది. ఒకప్పుడు పండుగలు, పబ్బాలకు తప్ప మిగతా రోజుల్లో కిలో నూనె నెలంతా సరిపోయేది. ఇప్పుడు ఐదారు కిలోలు తెచ్చినా సరిపోవడంలేదు. కారణం ఇప్పుడు వాడేవన్నీ రిఫైన్డ్ నూనెలే.
వంటనూనెను ఎక్కువగా వేడి చేస్తే అందులో ఉండే విటమిన్–ఇ ఆవిరైపోతుంది. అంతేకాదు.. ఏ నూనెనైనా నాలుగుసార్ల కంటే ఎక్కువ వేడి చేసి వాడకూడదు.
చాలామంది పామ్ ఆయిల్, పామ్ కెర్నెల్ ఆయిల్ రెండూ ఒకటే అనుకుంటారు. పామ్ ఆయిల్‌ను పండు నుంచి తీస్తారు. పామ్ కెర్నెల్ ఆయిల్‌ను గింజ నుంచి తీస్తారు. ఈ రెండూ ఒకేరకమైన గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే పామ్ కెర్నెల్ ఆయిల్‌ను వాడకపోవడమే మంచిది. ప్రస్తుతం మార్కెట్లలో మిక్స్డ్ ఆయిల్స్ కూడా దొరుకుతున్నాయి. వాటిని డైరెక్టుగా వాడుకోవచ్చు. రకరకాల కాంబినేషన్లతో ఉండే ఈ ఆయిల్స్‌ను కూడా తరచూ మారుస్తుండాలి. మన హెల్త్ కండీషన్‌ను బట్టి ఈ ఆయిల్ కాంబినేషన్‌ను నిర్ణయించుకోవాలి.