Home Unknown facts ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజును గురుపౌర్ణమి గా వ్యవహరిస్తారు ఎందుకు

ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజును గురుపౌర్ణమి గా వ్యవహరిస్తారు ఎందుకు

0

పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెల ఆషాడ మాసం. ఇది తెలుగు సంవత్సరంలో 4 వ మాసం. దీనిని శూన్య మాసమని కూడా అంటారు. వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ/పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల.. ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి లోకి ప్రవేశిస్తాడు. దాంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్ర లోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశి గా పరిగణిస్తారు. ఆషాఢ శుద్ధపౌర్ణమి రోజును గురుపౌర్ణమి గా వ్యవహరిస్తారు.

Ashadha Shuddhapurnamiఆషాడం.. ఆది అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. ఆది అంటే శక్తి అని అర్థం. కాబట్టి ఈ ఆషాడ మాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది. ఆషాడ మాసంలో పవిత్రమైన పూజలు, వ్రతాలు, రథ యాత్రలు, పల్లకి సేవలకు శుభప్రదం. అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఆషాడంలో ఆలయాలు పూజలు, పండుగలు, ప్రత్యేక సేవలతో కిటకిటలాడుతాయి. అలాగే పండితులు పూజా కార్యక్రమాల్లో నిగమ్నమై బిజీగా ఉంటారు. దీనివల్ల వారికి వివాహ తంతు నిర్వహించడానికి సమయం ఉండదు. ఈ కారణం వల్లే ఆషాడ మాసంలో వివాహాలు నిర్వహించరు.

ఆషాడమాసంలో చేతులకు గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారు. అయితే ఆషాడ మాసంలో వాతావరణ మార్పులు చోటుచేసుకుంటాయి. దీని వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం పాటించేవాళ్లట. ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాడంలో చిటికెన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీకం నాటికి గోరు చివరకు చేరుతుంది.. గోరింటాకు పెట్టుకున్న చిటికెన వేలి చిగురు నుంచి నీళ్లు శివలింగంపై పడితే పుణ్యఫలమని అంటారు.

ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి. ఆషాడంలో చేసే సముద్ర నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు. ఆషాఢ మాసం లో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం శుభకరం. ఆషాడ మాసం లోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. వేదం ప్రకారం చూసినా ‘అన్నం బహుకుర్వీత’ అంటోంది.. వ్యవసాయ దారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహం తోడై వర్ష రూపంగా, ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి, జనులకి ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్ధం.


‘ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాధ రధయాత్ర

ఆషాఢ శుద్ధ పంచమి ‘స్కంధ పంచమి’

ఆషాఢ శుద్ధ షష్టి ‘స్కంద వ్రతము – సృమతి కౌస్తుభం’ ఆ రోజున వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాలతో పూజ చేస్తారు. ఉపవాసం వుండాలి. జలం మాత్రమే పుచ్చుకోవాలి. కుమార స్వామిని దర్శించాలి.

ఆషాడ శుద్ధ సప్తమి – మిత్రాఖ్య భాస్కర పూజ అని నీలమత పురణము చెబుతుంది… ద్వాదశ సప్తమీ వ్రతము. చతుర్వర్గ చింతామణి..

ఆషాడ శుద్ధ అష్టమి – మిహషఘ్ని పూజ, సృమతి కౌస్తుభం

ఆషాడ శుద్ధ నవమి – ఐంద్రదేవి పూజ

ఆషాడ శుద్ధ దశమి – శాకవ్రత మహాలక్ష్మి వ్రతారంభము.

ఆషాఢ శుద్ధ దశమి.. మహలక్ష్మి వ్రతం..

ఈ రోజును మహాలక్ష్మి వ్రతారంభంగా చెప్తారు. దధి వ్రతారంభం అంటారు. ఈనాడు మహాలక్ష్మి పూజ చేసి ఒక నెల ఆకుకూరలు తినటం మానేసి ఆకుకూరలు దానం చేయాలి. ఈ రోజును చాక్షుషమన్వాం తరాది దినము అంటారు.

ఆషాడ శుద్ద ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం మొదలవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాడ మాసంలోనే తెలంగాణా ప్రాంతంలో సాంప్రదాయ బద్దమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. సమస్త జగత్తుకు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్ళు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి.

శుభకార్యాలకు పనికిరాదు అని భావింపబడుతున్నా… ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను, ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్య ఫలాలను ప్రసరించే మాసం ‘ఆషాడ మాసం’. ఈ మాసం లోని పూర్ణిమ నాడు చంద్రుడు పూర్వాషాడ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ మాసానికి ‘ఆషాఢ మాసం’ అనే పేరు ఏర్పడింది.

 

Exit mobile version