Home Health అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? దైవానుగ్రహం పొందడానికి మాత్రమేనా?

అసలు ఉపవాసం ఎందుకు చేయాలి? దైవానుగ్రహం పొందడానికి మాత్రమేనా?

0

మనలో చాలామంది దైవం పేరిట వారంలో వారికి ఇష్టమైన రోజున ఉపవాసం ఉండడం చేస్తుంటారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవుడికి ప్రీతికరమని తమ ఇష్ట దైవానికి ప్రీతి కరమైన రోజున ఉపవాసం ఉంటారు ఈ విధంగా ఉపవాసం చేయటం వల్ల వారిలో ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. ఈ ఉపవాసాలు ఒకొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తూంటారు. రోజంతా ఏమీ తినకుండా ఉండేవారు కొంతమంది. పగలు తిని రాత్రి తినని వారు, రాత్రి తిని పగలు తినని వారు, ఒక పూట అన్నం, మరొక పూట ఫలహారం ( పిండి వంటలు, పండ్లు, పాలు) తినే వారు, వండినవి తినని వారు, ఇలా ఎన్నో రకాల వారు కనపడతారు. ఉపవాసాన్ని ఒక్క పొద్దు అనటం కూడా వింటాం. అంటే ఒక పూట మాత్రమే తింటారనే అర్థం వస్తుంది.

fastingఇవన్నీ చూస్తే అసలు ఉపవాసం అంటే ఏమిటి? ఎలా చెయ్యాలి? ఉపవాసం చేయటం మంచిదేనా? అనే సందేహం రావటం సహజం. అయితే ఉపవాసం చేయటం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఉప‌వాసం చేసేవారు స‌హ‌జంగానే దైవం కోసం దాన్ని పాటిస్తుంటారు. కానీ ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్య‌ప‌రంగా కూడా లాభాలు క‌లుగుతాయి. వారంలో ఒక రోజు ఉప‌వాసం ఉండ‌డం వ‌ల్ల‌ అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. మనలో చాలా మంది రోజంతా బయటి ఆహారం లేదా జిడ్డుగల ఆహారాన్ని తింటాము, కానీ దానిని జీర్ణించుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయరు.

అటువంటి స్థితిలో, కొవ్వు, టాక్సిన్స్ శరీరంలో పేరుకుపోతాయి. దీనిని శరీరం నుంచి తొలగించడం చాలా ముఖ్యం. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండటం వల్ల మీ శరీరాన్ని విషపూరితం చేయడానికి పని చేస్తుంది. శరీరం నుండి విషాన్ని తొలగించడం వల్ల చర్మ సమస్యలన్నింటి నుండి ఉపశమనం లభిస్తుంది. అతిగా తినడం వల్ల శరీరంలోని కొవ్వు పేరుకుపోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఆహారాన్ని నియంత్రించడంతో పాటు, బరువును నియంత్రించడానికి వ్యాయామం చాలా ముఖ్యం. కానీ మీరు వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే అది కొన్ని రోజుల్లో మీ అదనపు శరీర కొవ్వును సమతుల్యం చేస్తుంది.

ఉపవాసం అనేది ఇంద్రియాలను నియంత్రించే ప్రక్రియ. ఉపవాసంలో మనస్సు సాత్వికంగా ఉంచబడుతుంది. శరీరం రిలాక్స్ అవుతుంది. ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. హైబీపీ త‌గ్గుతుంది. హార్మోన్ల అస‌మ‌తుల్య‌త ఉన్న‌వారు వారంలో ఒక రోజు ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ‌బ‌డ‌తాయి. శ‌రీరం ఆరోగ్యంగా ఉంటుంది. డ‌యాబెటిస్ స‌మ‌స్య ఉన్న‌వారు వైద్యుల సూచ‌న మేర‌కు వారంలో ఒక రోజు ఉప‌వాసం చేయ‌వ‌చ్చు. దీంతో ఇన్సులిన్ సెన్సిటీవిటీ పెరుగుతుంది. శ‌రీరం ఇన్సులిన్‌ను స‌రిగ్గా గ్ర‌హిస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ అదుపులో ఉంటుంది.

ఈ ఉపవాస నియమం అన్ని మత సంప్రదాయాల వారి లోనూ కనపడుతుంది. క్రైస్తవులు ఈస్టర్ పండుగకి ముందు 40 రోజులు ఉపవాస దీక్ష చేపడతారు. ఆ సమయాన్ని “లెంట్” అంటారు. పూర్తిగా భోజనం మానెయ్యక పోయినా ఏదో ఒక నియమాన్ని పాటిస్తారు. అంటే ఫలానా వస్తువు తినక పోవటం వంటివి. అంతే కాదు అబద్ధం చెప్పక పోవటం, ఎవరితోనూ కఠినంగా మాట్లాడక పోవటం వంటి ప్రవర్తనా నియమావళిని పాటిస్తుంటారు. అలాగే మహమ్మదీయులు కూడా రంజాన్ మాసంలో ఉపవాసాలు చేస్తారు. అసలు ఆ నెలని ఉపవాస మాసం అంటారు. ఉపవాసాన్ని “రోజా” అంటారు. వీరు పాటించే నియమాలు కష్టమైనవిగానే కనిపిస్తాయి. ఉపవాసం ఒక వ్యక్తి స్వభావాన్ని సాత్వికంగా మారుస్తుందని నమ్ముతారు. ఇది మనస్సుకు శాంతిని ఇస్తుంది. అయితే చాలామంది ఉపవాసం రోజున చక్కెర, ఉప్పు, చికోరీతో సహా అనేక రకాల పదార్థాలను వండుకుని తింటారు. ఇలా ఉపవాసం ఉంటే, ఉపయోగం ఉండదు.

Exit mobile version