Home Unknown facts నంది చెవులలో కోరికలు చెప్పే విధానం ఏంటో తెలుసుకోండి

నంది చెవులలో కోరికలు చెప్పే విధానం ఏంటో తెలుసుకోండి

0

శివాలయంలోకి అడుగుపెట్టగానే శివుడి కంటే ముందుగా నంది దర్శనం చేసుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ లింగాన్ని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకుంటారు. పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు.

నంది కొమ్ములుప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.

అయితే నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక విధానం ఉంది. కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రం, పేరు, కోరిక చెప్పడం మంచిది. తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి.

పృష్ఠ భాగాన్ని నిమురుతు, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వల్ల నంది అనుగ్రహం కూడా కలిగి శుభకరమైన ఫలితం దక్కుతుంది. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాసం ప్రాప్తిస్తుందని శివ పురాణం తెలియజేస్తోంది

 

Exit mobile version