Home Health రోజు నెయిల్ పోలిష్ పెట్టుకుంటే బరువు పెరుగుతారా?

రోజు నెయిల్ పోలిష్ పెట్టుకుంటే బరువు పెరుగుతారా?

0
ఫ్యాషన్ ట్రెండ్ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. ఫ్యాషన్ ప్రియులే కాదు ఈ కలం యువతలో దాదాపు అందరూ తమను తాము కొత్తగా చూపించుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఏదో ఒక సమయంలో కాదు ప్రతిక్షణం ఫ్యాషన్ ని ఆస్వాదీస్తున్నారు. అంతెందుకు ఒకప్పుడు పెళ్ళి కో పార్టీకో ఫంక్షన్ కో వెళ్తున్నప్పుడు నెయిల్ పాలిష్ వేసుకునే వారు.
కానీ ఇప్పుడు ప్రతిరోజు వారు వేసుకున్న డ్రెస్ కలర్ కి అనుగుణంగా నెయిల్ పాలిష్ లేదా నెయిల్ ఆర్ట్ వేసుకుంటున్నారు.రెండురోజులకు ఒక సారి పాతది తీసేయడం.. కొత్తది వేయడం.. మరి ఇంకా ఎక్కువ మాట్లాడితే.. రోజుకో రంగు కూడా వేసేస్తామంటూ మంచి మంచి కలర్స్ ని తమ పొడవాటి గోళ్ళ పై వేసేస్తూ ఉంటారు.
అమ్మాయిల చేతి వేళ్ళకు మరింత అందాన్నిచ్చేది నెయిల్ పాలిష్. అయితే చేతి వేళ్ళు అందంగా కనిపిస్తాయి కదా అని నెయిల్పాలిష్ ఎక్కువగా వేసుకుంటే ఆరోగ్యానికి హానికరమే అంటున్నారు పరిశోధకులు.  అసలు నెయిల్ పోలిష్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయి? నెయిల్ పాలిష్ ఎప్పుడు వేసుకుంటే మంచిది వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల్లో ఎక్కువగా నెయిల్ పాలిష్ వాడడం వల్ల బరువు పెరుగుతారని తేలింది. ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే రసాయనం ఉపయోగించి నెయిల్ పాలిష్‌ని తయారు చేస్తారు. ప్లాస్టిక్, ఫోమ్ ఫర్నీచర్‌కి మంటలు అంటుకోకుండా వాడే ఈ రసాయనాన్ని నెయిల్ పాలిష్‌ ఎక్కువ రోజులు మన్నేందుకు వాడతారు. ఈ రసాయనం వాడడం  వల్ల మానవ హార్మోన్స్‌పై ప్రభావం పడుతుంది. తద్వారా.. బరువు పెరుగుతామని తేల్చారు.
ప్రస్తుతం ఇప్పుడు మార్కెట్ లో దొరికే 3వేల రకాల నెయిల్  చేసిన పరిశోధనల్లో నెయిల్ ‌పాలిష్‌లో ట్రైఫెనైల్ ఫాస్పేట్  49శాతం ఉంటుందని తేల్చారు. గతంలో గోళ్ల రంగుల్లో వేరే పదార్థాలు వాడినప్పుడు పునరుత్పాదకతకు సంబంధించిన సమస్యలు తలెత్తాయి. దాంతో.. దానికి ప్రత్యామ్నాయంగా టీపీహెచ్‌పీని వాడుతున్నారు.
టీపీహెచ్‌పీ అనేది ఎండోక్రైన్ డిజ్రప్టర్ అని, అంటే హార్మోన్లపై దాని ప్రభావం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషులలో మాత్రం కొంతవరకు బరువు పెరుగుతున్నట్లు గుర్తించారు.  కొంతమందైతే అసలు అది ఉన్నట్లు చెప్పకుండానే కలిపేస్తున్నారు.
 ఇలాంటి నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల అనారోగ్య  సమస్యలు వస్తాయని, వీటిని వేసుకున్న 10 నుండి 14గంటల్లోపే మనలో టీపీహెచ్‌పీ పెరిగి బరువు పెరిగే అవకాశాలున్నట్లు తెలియచేస్తున్నారు. అయితే కృత్రిమ గోర్లు పెట్టుకొని వాటిని మాత్రమే నెయిల్ పాలిష్ వేసుకునే వారిలో బరువు పెరగలేదు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా వేసుకోవాలి అని, ఇది శరీరం లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది అంటున్నారు.
కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. అవసరం అంకుంటేనే నెయిల్ పాలిష్ వేసుకోండి. అది ఏవైనా ప్రమాదమే.. ఎక్కువ సార్లు గోర్ల  రంగులు వేసుకోవడం, మెయిల్ రిమూవర్ తో   వాటిని తుడపి వేసి దానిపై నెయిల్ పాలిష్ వేసుకోవడం వలన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. పైగా అవి శరీరం లోకి వెళితే లేనిపోని అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఒక వేళ నెయిల్ పాలిష్ వేసుకోవాలి అనుకుంటే మార్కెట్లో లభించే కృత్రిమ గోర్లు  పెట్టుకొని వాటిపై మీకు నచ్చిన విధంగా నెయిల్ పాలిష్ వేసుకోవచ్చు..

Exit mobile version