Home Life Style This Write-Up About The Vulnerability Of Men Is A Must Read For...

This Write-Up About The Vulnerability Of Men Is A Must Read For Everyone

0
Vulnerability Of Men

Written By Sumanth Bagannagari

ఏడు అయింది అనుకుంటా. మెలుకువ వచ్చింది. గదిలో మూడో మనిషి ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరా అని కళ్లు నలుపుతూ చూసాను. మనీష్. ఏదో చెప్తున్నాడు.

“రోజూ కనీసం ఒక నలుగుర్ని అయినా హగ్ చేస్కోవాలి అనిపిస్తుంది. కానీ ఏదో ఆపేస్తుంది. బేసిక్ ఎంపథీ చూపిద్దాం అన్నా కూడా, మోహమాటం అడ్డొస్తుంది.” మనీష్ అంటున్నదేంటో నాకర్థమయింది.

“ప్రాబ్లెమ్ అంతా మనం మగాల్లుగా పుట్టడమే రా” అన్నాడు. నాకర్థం కాలేదు. “మనకో వయసు వచ్చాక మనల్ని ఎవరూ ప్రేమగా తాకరు. ముఖ్యంగా మన పేట్రియార్కల్ కుటుంబాలు. మీ అమ్మానాన్న ఎప్పుడైనా నిన్ను హగ్ చేసుకున్నారా? నీ చెంపల మీద చేతులతో తాకారా?”

లేదన్నాడు వాడు. వాడే కాదు, ఎక్కడో అర్బన్ కుటుంబాల్లో తప్ప, అలా మగ పిల్లల మీద ఎంపథీ చూపించే వాళ్లు ఎవరున్నారు? ఎంత సేపు రాళ్లలా పెంచడమే తప్ప, సున్నితత్వం ఎక్కడ నేర్పుతారు? పొగర్లు, పౌరుషాలు నూరిపోస్తారు.

“నేనేడ్చి ఎన్నో ఏళ్లు అయిపోయింది. నాకు ఏడవాలని ఉంది.” నాకు మనీష్ ని చూస్తే జాలేసింది. వెళ్లి హగ్ చేస్కోవాలి అనిపించింది. కానీ ఎందుకో వెళ్లలేదు. నేను మగాడ్నే కదా! అలా ఇంకో మనిషిని ప్రేమగా దగ్గరికి తీస్కోడం నేర్పలేదు.

International Men’s Day

Exit mobile version