Yamaha Nagari : The Beauty Of Veturi’s Lyrics And Its Indepth Meaning

0
19368

By Charan Tupurani

కలకత్తా నగర గొప్పదన్నాన్ని ఏ కవి కూడా వర్ణి౦చన౦త గొప్పగా చూడాలని ఉ౦ది సినిమా లొ యమహా

నగరి అనే పాట లొ వేటూరి గారు వర్ణి౦చారు.ఈ సాహిత్య౦ గురి౦చి గానగ౦దర్వుడు ఎస్.పి.బాలు గారు ఓ

స౦దర్బ౦లొ ప్రస్తావిస్తూ,నొబెల్ పురస్కార గ్రహీత రవీ౦ద్రనాద్ ఠాగూర్ కూడా కలకత్తా గొప్పదనాన్ని

ఇ౦త అద్బుత౦గా చెప్పలేదు అని అన్నారు.ఈ పాటలొని ప్రతీ పదానికి ఒక అర్ద౦, అ౦తరార్ద౦

ఉన్నాయి పాట నేపధ్యం హీరో శ్రీ చిరంజీవి కలకత్తా మహా నగరానికి వచ్చి, భాష రాకపోవడం వల్ల,

తనకు తోడు వుండడానికి, దారి చూపడానికి, ఆశ్రయం ఇవ్వడానికి ఎవరైనా తెలుగు వాడు దొరుకుతాడా,

అని అదురు చూస్తూ, తాను తెలుగు వాడినని గుర్తుగా పాట పాడడం.

పల్లవి:

యమహా నగరి కలకత్తా పురి – ( పూర్వం కలకత్తా నగరానికి, యమ పురి అనే పేరు వుండేదట, అందుకే యమహా నగరి, అన్న పదం వాడారు)

నమ హో హుగిలీ, హౌరా వారధీ – ( ఇక్కడ గంగానదిని హుగిలీ అనే పేర పిలుస్తారు, )

చిరు త్యాగరాజు, నీ కృతినే పలికెను – ( పాడే హీరో తనని తాను కలకత్తా నగర గుణ గణాలు వివరించే చిన్న త్యాగరాజు గా చెప్పడం)

చరణం 1:

నేతాజీ పుట్టిన చోట, గీతాంజలి పూసిన తోట, పాడనా తెలుగులో – ( నేతాజీ, గీతాంజలి ఇక్కడే పుట్టాయి)

ఆ హంస పాడిన పాటే, ఆనందుడు చూపిన బాట సాగనా – ( రామకృష్ణ పరమ హంస చెప్పిన దారిలో, వివేకానందడు నడిచాడు అంటూ ఇద్దరూ అక్కడి వారే అని తెలుపడం)

పదుగురు పరుగు తీసింది పట్నం -( అందరి పరుగులతో హడా విడిగా వుండే నగరం)

బతుకుతో వెయ్యి పందెం – ( ఇక్కడ బతకడం అంటే జీవితంతో పందెం కాచెంత సాహసం వుండాలి)

కడకు చేరాలి గమ్యం – ( అయినా నేను చివరకు గమ్యం చేరుకోవాలి)

కదలి పోరా – ( ముందుకు పొతూ వుండాలి)

ఒకరితో ఒకరికి ముఖ పరిచయములు దొరకని క్షణముల – ( ఎవరితోనూ కనీసం నేను ఫలానా అని చెప్పుకునే సమయం కూడా దొరకనంత)

బిజీ బిజీ బ్రతుకులా గజి బిజీ ఉరుకుల పరుగుల – (నా గోడు వినిపించుకొలేనంత హడావిడితో బిజీగా, అటు ఇటు పరుగులు తీసే జీవులే)

చరణం 2:

బెంగాలీ కోకిల బాల, తెలుగింటి కోడలు పిల్ల మానినీ సరోజినీ – ( మీ బెంగాలీ అమ్మాయి కవయిత్రి అయిన సరోజినీ మా ఇంటి ఆడపడుచు తెలుసా అని తాను ఏ ప్రాంతం వాడో చెబుతున్నాడు)

రోజంతా సూర్యుడి కింద – ( సరే అలాగే రోజంతా నీడ లేకుండా గడుపుతా మీరు పట్టించుకోకపోతే)

రాత్రంతా రజనీ గంధ సాగనీ – ( కానీ రాత్రికి మీ రజని గాంధా పూలు నాకు తోడుండి హాయితో ఆదరిస్తాయి లే )

పదుగురు ప్రేమలే లేని లోకం – ( నాకు కొద్ది మంది స్నేహం కూడా లేని ఈ లోకం), ( కనీసం నువ్వు ఎవరవని అడిగే వారు లేని లోకం)

దేవత మార్కు మైకం – ( ఎప్పుడు మెల్కునే వుండే, ఎప్పుడు నిదరపోనీ మైకంలో వుండే నగరం)

శరన్నవలాభిషేకం తెలుసుకోరా – ( శరత్ చంద్రడు వ్రాసిన నవలలనే అభిషేకం లో తడిసిన నగరమా)

కధలకు నెలవట – ( అనేక మండి రచయితలకు, కధలకు నువ్వే inspiration)

కళలకు కొలువట – ( గొప్ప కళా కారులు పేరు తెచ్చుకున్న చోటు )

తిథులకు సెలవట – ( ఇక్కడ పనులకు మంచి చెడు అనే భేదం లేదు) ( కలకత్తా నేరాలకు కూడా బాగా పేరు పొందిన నగరం)

అతిధుల గొడవట – ( ఎప్పుడూ కొత్తగా వచ్చే నా వంటి అతిధుల గొడులతో )

కలకత నగరపు కిటకిటలో – ( ఎప్పుడూ వచ్చే పోయే వారి, హడా విడుల సందడితో నిండిన నగరమా)

చరణం 3:

వందేమాతర మే అన్న వంగ భూతలమే మిన్న, జాతికే గీతిరా – ( వందేమాతరం అన్న జాతీయగీతాన్ని ఇచ్చిన వంగ దేశం మాకు పూజనీయమైనది )

మాతంగి కాళీ నిలయ చౌరంగి రంగుల దునియా నీదిరా – ( అమ్మ వారు కాళికా దేవి రూపంలో కొలవబడే చోటు, chowrangee రోడ్ లాంటి బిజీ రొడ్లతో నిండిన ప్రపంచం నీదే)

విను గురు సత్యజిత్రే సితారా – ( విను మహాశయుడైన సత్యజిత్ రే చిత్రాల తారా )

ఎస్ డి బుర్మన్కి ధారా థెరిసాకి కుమారా కదలి రారా – ( సంగీత కారుడైన s d burman పుట్టిన నేలా, మదర్ థెరీసా ఇక్కడి ప్రాణులకు సేవ చేసి తల్లి అయిన స్థలమా)

జనగనముల స్వరపద వనముల హృదయపు లయలను – ( జనగణమన అనే స్వరాలతో స్వాతంత్రం కోరిన హృదయాల స్పందనను)

శృతి పరచిన ప్రియ సుక పిక ముఖ సుఖ రవాలులతో – (ఒకటి చేసిన ప్రియమైన రవీంద్రనాధ్ అనే చిలుక నోట పలికిన జనగణమన గానాలనే సంగీతం అందించిన ఓ కలకత్తా నగరం అనే వనమా ),

“అంత గొప్ప నగరమా నాకు ఆశ్రయo ఇవ్వు”, అని హీరో పాడుకునే పాట. ఈ పాటలో History, Geography, Social Study, Humanity, Topography, Cinema, Literature, Spiritualism, God, Pleasure, Pain, Freedom, Struggle, Films, Art, Life, Nature, City, Beauty, మొదలైన అంశాలను ఒక హృదయమున్న Journalist, ఒక మహానగరాన్ని కీర్తిస్తూ పాట వ్రాస్తే ఎలా వుంటుందో అలా రచించారు.

PS:ఈ పాటని ఇ౦త విపుల౦గా వివరి౦చి౦ది వేటూరి గారి కుమారుడు శ్రీ వేటూరి రవి ప్రకాశ గారు



Watch our Mahatalli originals here.