Ascharyanni kaliginche lakshmi Narasimha Swamy aalauam ekkada undhi?

0
6993

మన దేశంలో ఎన్నో మహిమలు గల ఆలయాలు ఉన్నాయి. అందులో కొన్ని దేవాలయాలు అక్కడ ఎలా వెలిసాయనే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. అలా ఎన్నో మహిమలు గల ఆలయాలలో ఈ లక్షింనరసింహ స్వామి దేవాలయం ఒకటి. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశిష్టత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. lakshmi narasimha swamyతెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని వెంకటాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మత్మ్యాద్రి దేవాలయం ఉంది. ఇక్కడ నాలుగు కొండల మధ్యనున్న గుట్ట మీద బండరాయిపై స్వయంభూగా వెలిశాడు లక్ష్మీనరసింహస్వామి. ఈ ఆలయంలో స్వామివారు మత్స్యవతారంలో భక్తులకు దర్శనం ఇస్తుండడంతో మత్స్యగిరి ఆలయంగా పేరొందింది. అయన కొలిచిన వారికి కొండంత అండగా, భక్తుల కొంగు బంగారంగా ఇక్కడ ప్రసిద్ధి చెందినాడు. lakshmi narasimha swamyమొదట్లో ఈ ఆలయాన్ని వేములకొండ గుట్టగా పిలిచేవారు. అయితే మత్స్యగిరిగుట్ట సమీపంలోని పొట్టిగుట్టపై చూస్తే స్వామి వారు వెలిసిన గుట్ట చేప రూపంలో దర్శనం ఇవ్వడం, గుట్ట మీదకు వెళ్తుంటే సగ భాగం వద్ద శిలద్వారానికి చేప శిల్పం చెక్కి ఉండడంతో మత్స్యగిరిగుట్టకు ఆ పేరొచ్చింది. కాగా నామాలగుండం, విష్ణుగుండం, మాలగుండం పేర్లు కలిగిన మూడు గుండాల కలయికతో కొలను ఏర్పడింది. కొలనులో నీరు ఏ కాలంలోనైనా అదే స్థాయిలో ఉండటం, కొలనులోని చేపలన్నీ ఒకే పరిమాణంలో ఉండటం, గర్భగుడి ముందుండే కొలనులోని చేపలు నామాలు కలిగి ఉండడం ఆలయ ప్రత్యేకత. ఇంకా స్వామివారు కూడా మత్స్య రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వడంతో మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంగా ఖ్యాతికెక్కింది.lakshmi narasimha swamyస్వామి వారి ఆలయం ముందున్న కొలనులోని నీటిని పంట చేలలో చల్లుకుంటే పంటలను ఆశిస్తున్న చీడపీడలు దూరమై దిగుబడి పెరుగుతుందని నమ్మకం. వ్యాపార సంస్థలలో ఆ నీటిని చల్లితే వ్యాపారాలు అభివృద్ధిలో నడుస్తాయని ప్రతీతి. అందుకే భక్తులు కొలనులోని నీటిని తీసుకెళ్తారు. ఇక అనారోగ్యం పాలైన వారు స్వామివారి ఆలయ సన్నిధిలో నిద్ర చేస్తే స్వామివారు కలలోకి వచ్చి ఆయా రుగ్మతలను నయం చేస్తారని నమ్మకం. దీంతో భక్తులు గుట్టపై నిద్ర చేస్తారు.lakshmi narasimha swamyఇంకా వలిగొండ పట్టణంలో ముగ్గురు అమ్మవార్లు ఒకే ఆలయంలో కొలువైన ఇష్టకామేశ్వరస్వామి త్రిశక్తి ఆలయం ఉంది. ఈ ఆలయ సముదాయంలో 9 ఆలయాలు ఉన్నాయి. సంగెం వద్ద భీమలింగం కత్వ వద్ద భారీ శివలింగం ఉంటుంది. దీనిని భీముడు ప్రతిష్టించడంతో భీమలింగంగా పేరొందిందని ప్రతీతి. అలాగే సుంకిశాలలో యాదాద్రి దత్తత ఆలయమైన శ్రీ వెంకటేశ్వర ఆలయ సముదాయం ఉంది. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయు స్వామి కావడంతో స్వామి వారి దర్శనానంతరం భక్తులు ఆంజనేయస్వామిని దర్శించుకుంటారు.lakshmi narasimha swamyఈ విధంగా స్వయంభువుగా మత్స్య అవతరంలో వెలసిన లక్ష్మీనరసింహ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తూ పూజలందుకొంటున్నాడు. 6 acharyanni kaliginche lakshminarasimahswami alayam ekkada undhi