Main Reason Why Narada cursed Vishnu Murthy

0
1640

నారదుడు నిరంతరం నారాయణ మంత్రాన్ని జపిస్తూ ముల్లోకములలో ఉన్న సమాచారాన్ని అటు ఇటు చేరవేస్తుంటాడు. మరి ఇలాంటి నారదుడు విష్ణుమూర్తిని ఎందుకని శపించాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న కారణం ఏంటనే విషయాలను మనము ఇప్పుడు తెలుసుకుందాం.

Narada cursed Vishnu

నారదుడు భగవన్నామస్మరణలో మునిగిపోతే ఆయనను కామదేవుడు కూడా కదిలించలేడు. కాముడు శివుడంతటి వాడి ధ్యానాన్ని కూడా చెడగొట్టాడు కానీ, నీ ధ్యానాన్ని మాత్రం భంగపరచలేకపోయాడు అంటూ ఒకరు అన్నమాటలకి నారదుడు పొంగిపోయి అవును నేను శివుడి కంటే గొప్పవాడిని అంటూ అహకారభావం పెరిగిపోయింది. నారదునిలో వస్తున్న మార్పుని పసిగట్టాడు నారాయణుడు. తన భక్తునికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకోని తన సతి లక్ష్మీదేవిని భూమిమీద అవతరించమన్నాడు.

Narada cursed Vishnu

అయోధ్య రాజ్యాన్ని పాలిస్తున్న అంబరీషుడు అనే రాజుకి కుమార్తగా లక్ష్మీదేవి అవతరించింది. ఆమెకు శ్రీమతి అన్న పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచసాగారు రాజదంపతులు. ఒకసారి నారదుడు లోకసంచారం చేస్తూ ఆ అంబరీషుని అంతఃపురానికి కూడా చేరుకున్నాడు. అక్కడ అందాలరాశిగా ఉన్న లక్ష్మీదేవిని చూసిన నారదుని మనసు చలించిపోయింది. ఎలాగైనా ఆమెను తన భార్యగా చేసుకోవాలన్న మోహం మొదలైంది. తన మనసులో ఉన్న మాటను అంబరీషుని వద్ద ప్రస్తావించాడు నారదుడు.

Narada cursed Vishnu

అంబరీషుడు. స్వామీ నేను ఒక స్వయంవరాన్ని ఏర్పాటు చేస్తాను. అందులో కనుక నా కుమార్తె మిమ్మల్ని వరిస్తే, ఆమెను మీకిచ్చి వివాహం జరిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. అప్పుడు స్వయంవరంలో రాజకుమారి తననే వరిస్తుందన్న నమ్మకం ఏమిటి అన్న అనుమానం కలిగింది నారదునికి. అందుకోసం ఏదన్నా ఉపాయాన్ని సూచించమంటూ సాక్షాత్తూ ఆ శివుని చెంతకు వెళ్లాడు. నారదుని అనుమానాన్ని విన్న శివుడు చిరునవ్వుతో నారాయణుడిని మించిన అందగాడు ఎవరుంటారు. నువ్వు కనుక విష్ణుమూర్తి అంత అందంగా కనిపిస్తే ఆ అమ్మాయి తప్పకుండా నిన్ను వరించి తీరుతుంది అన్నాడు.

Narada cursed Vishnu

అప్పుడు నారదుడు వైకుంఠానికి చేరుకొని స్వామీ భూలోకంలో శ్రీమతి అనే రాజకుమారికి స్వయంవరం జరుగుతోంది. ఆ స్వయంవరంలో పాల్గొని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని అనుకుంటున్నాను. మరి ఆ స్వయంవరంలో నెగ్గాలంటే నీ అంత అందం ఉండాలని పరమేశ్వరుడు చెప్పాడు. కాబట్టి ఆ రోజున ఆ రాజకుమారి నన్ను చూసినప్పుడు అచ్చు మీలాగే కనిపించేలా అనుగ్రహించండి అన్నడు. స్వామివారు చిరునవ్వి ఊరుకున్నారు. నారదుడు ఆ చిరునవ్వునే అనుగ్రహంగా భావించి బయల్దేరిపోయాడు.

Narada cursed Vishnu

స్వయంవరం రోజు వరుని వరించేందుకు పూలదండ చేపట్టి వచ్చిన రాజకుమారికి అక్కడ నారదుడు కనిపించలేదు అందరి మధ్య కోతిమొహంతో ఉన్న ఓ సన్యాసి కనిపించాడు. అతడిని చూడగానే రాజకుమారి నిలువెల్లా భయంతో వణికిపోయింది. ఆ సన్యాసి పక్కనే ఒక మోహనాంగుడు కనిపించడంతోనే అసంకల్పితంగా ఆయన మెడలో దండ వేసింది. శ్రీమతి ఎప్పుడైతే అలా దండ వేసిందో వారిరువురూ మాయమైపోయారు. ఇదంతా చూస్తున్న నారదునికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. తన కళ్ల ముందే అసలైన విష్ణుమూర్తి రావడం, రాజకుమారి ఆయనను వరించి మాయమైపోవడం చూసి ఆయనకు మతిపోయింది. ఇంతలో ఎదురుగుండా ఉన్న కొలనులో తన ప్రతిబింబాన్ని చూసుకుని నారదునికి జరగినది అర్థమైంది.

Narada cursed Vishnu

విష్ణుమూర్తి తన మొహాన్ని కోతి మొహంగా మార్చేశాడనీ, అటుపై రాజకుమారిని వివాహం చేసుకున్నాడని అర్థమైంది. వెంటనే పట్టరాని ఆవేశంతో తాను ప్రేమించిన స్త్రీని తన నుంచి దూరం చేశాడు కాబట్టి, విష్ణుమూర్తి కూడా సతీ వియోగంతో బాధపడతాడనీ, చివరికి ఓ కోతి కారణంగానే వారిరువురూ కలుసుకుంటారనీ శపించాడు.

Narada cursed Vishnu

కొంతకాలానికి కామానికి సైతం లొంగననుకుని గర్వించిన తనకి బుద్ధి చెప్పేందుకే నారాయణుడు ఈ నాటకమాడాడని నారదుడికి తెలిసి వచ్చింది.