550 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ నూకాంబిక దేవి ఆలయ విశేషాలు

0
9824

శ్రీ నూకాలమ్మ వారు ఇక్కడి గ్రామస్థుల గ్రామదేవతగా వెలుగొందుచున్నది. ఈ అమ్మవారు చాలా శక్తివంతురాలని భక్తుల నమ్మకం. ఈ ఆలయం చాలా పురాతనమైనదిగా చెబుతారు. మరి ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

nukalammaఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖపట్టణం జిల్లా, అనకాపల్లి అనే పట్టణంలో శ్రీ నూకాంబిక దేవి అనే గ్రామదేవత ఆలయం ఉంది. ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 550 సంవత్సరాలు అయినట్లుగా చరిత్ర తెలియచేస్తుంది. ఈ తల్లికి నూకాంబిక మరియు కాకతాంబ అనే పేర్లు కూడా ఉన్నాయి. 1450 వ సంవత్సరంలో అనకాపల్లి ప్రాంతాన్ని పరిపాలించిన కాకర్లపూడి అప్పలరాజు అనే కళింగరాజు అనకాపల్లిలో ఒక కోటను నిర్మించి ఆ కోటకు దక్షిణభాగంలో కాకతాంబ ఆలయాన్ని నిర్మించాడు. ఆ తరువాత బ్రిటీషువారు విజయనగరం రాజును అనకాపల్లి రాజుగా నియమించారు. బ్రిటిషువాళ్లే కాకతాంబ అనే పేరుని నూకాంబిక అని మార్చటం జరిగింది.

nukalammaఅనకాపల్లి పట్టణంలో వేంచేసియున్న లక్షలాది మందికి ఆరాధ్యదైవం అయినా శ్రీ నూకాంబిక అమ్మవారు పూర్వం నవశక్తులలో ఒక శక్తి అయినా “శ్రీ అనఘాదేవి” గా ప్రతిష్ఠితమై పూజలందుకొనుచున్నది. ఈ క్షేత్రం లో వెలసిన అనఘాదేవి అన్న శక్తి స్వరూపిణి కారణంగానే ఈ ఉరికి మొదట అనఘాపల్లి అని ఆ తరువాత అనకపల్లిగా ఈ క్షేత్రం పేరు మార్పు చెందిందని తెలుస్తున్నది. కాలక్రమములో శిధిలమై, మరల కాకతీయ రాజుల ప్రభావంచే శ్రీ కాకతాంబ గా పునః ప్రతిష్టించబడిన ఈ మాత నిత్య పూజలు అందుకొంటూ భక్తులకు వరప్రదాయినిగా ఉన్నది.

nukalammaఆర్కాటునవాబు వద్ద సేనాధిపతిగా పనిచేసిన శ్రీ కాకర్లపూడి అప్పలరాజు క్రీ.శ. 1611 సంవత్సర కాలంలో ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించబడ్డారు. అప్పటివరకు “శ్రీకాకతాంబ” గా పిలవబడుచున్న అమ్మవారిని శ్రీ కాకర్లపూడి అప్పలరాజు తమ ఇలవేలుపుగా మరియు కోటను రక్షించు శక్తి అయిన “శ్రీనూకాంబిక అమ్మవారు” గా పేరు మార్చి శాక్తేయగమానుసారము పూజించసాగారు. అప్పటినుండి నిత్యపూజలు అందుకుంటూ గొప్ప మహిమలు గల అమ్మవారిగా భక్తులు హృదయాలలో నిలిచిపోయింది. ఈమెను దర్శించి ప్రార్దించిన భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించగలదని ఈ ప్రాంత ప్రజల గట్టి నమ్మకం.

nukalammaకలియుగ ప్రారంభానికి సంకేతంగా నిలిచే ఉగాది పర్వదినానికి ముందురోజు అమావాస్యనాటి నుండి అనగా ఫాల్గుణ బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబిక సమక్షంలో కొత్త అమావాస్య జాతర జరుగుతుంది. ఉత్తరాంధ్రలో బాగా పేరుపొందిన ఈ జాతరకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.

nukalamma