Surprising Facts About Undavalli Caves

0
1397

ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా ఎంతో అద్భుతంగా మలిచిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. ఒక్కో అంతస్తులో ఉండే దేవతామూర్తి విగ్రహాలను శిల్పులు అందంగా తీర్చిదిద్దారు. ఇక్కడ బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురు త్రిమూర్తులను మనం దర్శించవచ్చు. మరి ఉండవల్లి గుహల్లో ఉన్న విషయాల గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1-Cave

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, తాడేపల్లి గ్రామానికి దగ్గరలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న గుహాలయాలు ఒక పర్వత సముదాయం. వీటిని పర్వతం ముందు భాగం నుండి లోపలికి తొలుచుకుంటూ వెళ్లారు. ఇంకా మధ్యలో స్థంబాలు, గుహ అంతర్భాగంలో గోడలపైన దేవత విగ్రహాలు మనకి కనిపిస్తాయి.

Undavalli Caves

ఈ గుహలు క్రీ.శ. 4 లేదా 5 వ శతాబ్దానికి చెందినవి గా తెలియుచున్నది. ఈ గుహలలో ఉన్న నాలుగు అంతస్తులలో కొన్ని ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాయితో చెక్కబడిన అనంత పద్మనాభస్వామి శిల్పం ఉంది. ఈ స్వామి ఉన్న ఇక్కడ ఉన్న గుహలలో చాలా పెద్ద గుహ అని చెబుతారు. ఇక్కడే దాదాపుగా 20 అడుగుల ఏకరాతితో చెక్కబడిన అనంతపద్మనాభస్వామి వారి విగ్రహం ఉంటుంది.

Undavalli Caves

ఈ విగ్రహం పొడువగా శేషపానువుతో కుడి గుహాంతర్బాగమున కమలంలో కూర్చున్న బ్రహ్మ మరియు సప్తఋషులు ఇతర దేవత విగ్రహాలు ఉంటాయి. ఇంకా ఇక్కడ ఇతర ఆలయాలు బ్రహ్మ, విష్ణువు, శివుడు ఆలయాలు ఉన్నవి. ఈ గుహాలయాల నుండు పూర్వం మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని, ఈ మార్గం గుండా రాజులూ వారి సైన్యాన్ని శత్రువులకు తెలియకుండా పంపించేవారని చెబుతారు.

Undavalli Caves

ఈ గుహల నిర్మాణశైలి బౌద్ధ శైలిని పోలి ఉంటుంది. ఒకప్పుడు వర్షాకాలంలో బౌద్ధ సన్యాసులు ఈ గుహాలలోనే నివసించేవారని తెలియుచున్నది. ఇంతటి అద్భుత నిర్మాణాలు ఉన్న ఈ ఉండవల్లి గుహలను చూడటానికి పర్యాటకులు ఎప్పుడు వస్తుంటారు.