మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందువులు అంత కూడా గొప్పగా జరుపుకునే పండుగ దసరా. అయితే దసరా రోజు సాయంత్ర సమయంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండ పాలపిట్టని చూడాలనే నియమం ఒకటి ఉంది. మరి అసలు దసరా రోజే పాలపిట్టని ఎందుకు చూడాలి? ఇలా చెప్పడం వెనుక పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. దసరా పండుగ వచ్చిందంటే అమ్మవారి పూజలు, పిండి వంటలతో పండగ వాతావరణం మొదలవుతుంది. ఇక దసరా రోజున సాయంత్రం తప్పకుండ అందరు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు పాలపిట్టని చూడటానికి వెళ్తారు.
ఇలా పాలపిట్టని చూడటం వెనుక ఒక పురాణం ఉంది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకొని తిరిగి వస్తుండగా వారికీ పాలపిట్ట కనిపించిందని అప్పటినుండి వారికి విజయాలు సిద్దించాయని పురాణం. అందుకే పూర్వం మగవారు విజయదశమి నాడు అడవులకి వెళ్లి పాలపిట్టని చూసివచ్చే వారని చెబుతారు.
ఇలా విజయదశమి రోజున పాలపిట్టని చుస్తే శుభం కలుగుతుందని, విజయం సిద్ధిస్తుందని, నవ అనుగ్రహాలు కలుగుతాయని, దోషాలు అన్ని తొలగిపోయి చేపట్టిన ప్రతి పని కూడా పూర్తవుతుందని నమ్మకం. అందుకే పాలపిట్టని శుభాల పిట్టా అని అంటారు. దసరా అంటే జమ్మి చెట్టు ఏవిధంగా అయితే గుర్తొస్తుందో పాలపిట్టా కూడా అదేవిధంగా గుర్తుకు వస్తుంది. తెలంగాణ ప్రాంతంలో ఈ పాలపిట్టకి చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట.
పాలపిట్ట శుభాల పిట్టా కనుక తప్పక ప్రతి ఒక్కరు దసరా రోజున చూసి భక్తి శ్రద్దలతో మొక్కాల్సిందే అని చెబుతుంటారు.