10 Quotes By YS Rajashekar Reddy Garu That Proves He Is A Visionary: వై.యస్. రాజశేఖరరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర16వ ముఖ్యమంత్రి 1978లో తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంనుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారు.
2003 వేసవికాలంలో ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1,467 కిలోమీటర్లు పర్యటించాడు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్.కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
2004 మేలో జరిగిన 12వ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికస్థానాలు సాధించడంతో అదివరకే పార్టీలో పేరు సంపాదించిన వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. పాదయాత్ర వలన జనాదరణ పొందడమే కాకుండా ఎన్నికల ప్రచారంలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తిచేయటం, జలయజ్ఞంలకు ప్రాధాన్యం ఇవ్వడంతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన పిదప తొలి సంతకం ఉచిత విద్యుత్తు ఫైలు పైనే చేశాడు. 2009 ఏప్రిల్లో జరిగిన 13వ శాసనసభ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలలో విజయం సాధించడానికి కృషిచేసి వరుసగా రెండో పర్యాయం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాడు.
10 Visionary Quotes By YS Rajashekar Reddy, Take A Look
1. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదు, పేదింట్లో పుట్టిన ప్రతి ప్రతిభావంతుడు ఉన్నత చదువులు చదవాలి.
2. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి.
3. అన్నం పెట్టె రైతన్నను రుణ విముక్తున్ని చేయడమే నా లక్ష్యం.
4. నిరుపేదలకు పట్టెడన్నం దొరికేటట్లు చేయడం ప్రభుత్వ ధర్మం.అందుకు ఎన్ని కోట్లు ఖర్చయినా వెనుకాడకూడదు.
5. ఆంద్రప్రదేశ్ ను దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేది నా స్వప్నం.
6. అవినీతి,అసత్య వార్తలు క్యాన్సర్ కన్నా ప్రమాదకరం.
7. ప్రాజక్టులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు తరాలు ఎవరినీ క్షమించవు
8. మహిళల ముఖాలు కలకలలాడుతూ ఉంటేనే కుటుంబమూ,సమాజమూ బాగుంటాయి.
9. నేను కలలుగన్న మరో ప్రపంచానికి మహిళలే మూలస్తంభాలు.
10. గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవ్వరూ ముఠా కక్షల జోలికి వెళ్లరు.