ఇటీవల కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయినా ఫలితం తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఇష్టమైన ఆహారాలను కూడా తినడం మానేస్తారు. కానీ కొన్ని ఆహారాలు బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అందులో బెండకాయ ఒకటి. దీన్ని లేడీ ఫింగర్ లేదా బెండకాయలను ఓక్రా అని కూడా పిలుస్తారు.
బెండకాయల పేరు చెప్పగానే పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మార్కెట్లో అధికంగా దొరికే కూరగాయల్లో బెండకాయ ఒకటి. చెప్పాలంటే మిగతా కూరగాయలతో పోలిస్తే దీని రేటు మరీ పెరగదు. మరీ తగ్గదు. వీటితో ఎన్నో రకాల వంటలు చేస్తారు చాలామంది. వీటిని తింటే లెక్కలు బాగా వస్తాయని చాలామంది చిన్నపిల్లలకి బెండకాయ వండిపెడతారు. బెండకాయల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. వాటివల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అయితే ఈ బెండకాయతో కలిగే లాభాలేంటి? తింటే బరువు నిజంగానే తగ్గుతారా అనేదిఇప్పుడు తెలుసుకుందాం..
బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల హృదయ సంబంధ ఇబ్బందులకు తావు ఉండదు. అంతేకాదు చెడుకొవ్వును శరీరం నుంచి బయటకు పంపించి వేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. బెండకాయలో కేలరీలు తక్కువ ఉంటాయి. అదీగాక అధిక శాతం ఫైబర్ కారణంగా కడుపు నిండుగా అనిపిస్తుంది. తద్వారా తక్కువ తింటారు. దాని మూలంగా బరువు తగ్గుతారు.
బెండకాయ కూరల్లోనే కాదు మామాలుగా తిన్నా పోషకాలు అద్భుతంగా అందుతాయట. ఎలా అంటే చిన్న బెండకాయలు 2 లేదా 3 తీసుకొని బాగా కడగాలి. వాటి మొదలు, చివర్లు తీసేయాలి. వాటిని నిలువుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను గ్లాస్ నీటిలో వెయ్యాలి. ఇలా రాత్రంతా బెండకాయ ముక్కల్ని ఉంచితే అవి బాగా నానుతాయి. వాటిలో పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి. ఉదయాన్నే నీటిలోని బెండముక్కల్ని తీనేసి నీటిని తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గించడమే కాకుండా బెండకాయ లో ఉండే విటమిన్ కె ఎముకలు దంతాలు దృఢంగా మారుతుంది. మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది ఒత్తిడి తలనొప్పి వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
బెండకాయలు ఫైబర్, ప్రోటీన్,ఐరన్, క్యాల్షియం, జింక్ తదితర పోషకాలు పుష్కలంగా ఉండటంవల్ల శరీరానికి పోషక విలువలు అందుతాయి. బెండకాయల్లో ఫ్లేవనాయిడ్స్ , పాలీఫినాల్స్, అనబడే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అలసట,నీరసం రాకుండా ఉత్సహం గా ఉండేలా చేస్తాయి.బెండకాయలు తినడం వల్ల క్లోమగ్రంథి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శరీరం ఇన్సులిన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీని వల్ల షుగర్ అదుపులో ఉంటుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో బెండకాయలు ఎంతగానో సహాయపడుతాయని న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు.
డయాబెటిక్ పేషంట్ అయితే డయాబెటిస్ డైట్లో భాగంగా బెండకాయలను కూడా జోడించవచ్చు. గర్భధారణ సమయంలో రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి బెండకాయలు ఎంతగానో సహాయం చేస్తాయి. క్రమంగా గర్భస్థ మధుమేహం కలుగకుండా సహాయపడుతుందని చెబుతున్నారు. శరీరంలో రక్తం తగ్గి రక్తహీనత రాకుండా బెండకాయ కాపాడుతుంది. ఫోలేట్, విటమిన్ కె మొదలగునవి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టాలంటే విటమిన్ కె చాల అవసరం.బెండకాయ ల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉండడం వలన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లుదరిచేరవు. అలాగే కంటికి సంబందించిన సమస్యలు తగ్గిపోతాయి.
లివర్ ఆరోగ్యంగా ఉంటేనే శరీరం లో అనేక జీవ క్రియలు సక్రమం గా జరుగుతాయి. బెండకాయలను ఎక్కువ సార్లు తింటూ ఉండడం వల్ల లివర్ ఆరోగ్యం పాడవకుండా ఉండడంతో పాటు లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు కూడా బయటకు వెళ్లిపోతాయి. నిత్యం ఒత్తిడి, ఆందోళనల కి గురిఅయేవాళ్లు ఆహారంలో బెండకాయలను తీసుకుంటే మానసిక ప్రశాంతత కలుగుతుంది.