మహాభారతంలో శకుని పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో అందరికి తెలిసిందే. శకుని కౌరవులకు స్వయానా మేనమామ, పాండవుల పతనం కోసం శకుని కౌరవుల పక్షాన ఉండి వారిని ఉసికొల్పి కురుక్షేత్ర యుద్ధం జరగడానికి ముఖ్య కారకుడని చెబుతుంటారు. కానీ మహాభారతంలో శకుని అసలు వ్యూహం మాత్రం మరోలా ఉందని పురాణాలూ చెబుతున్నాయి. మరి శకుని అసలు పన్నాగం ఏంటి? శకుని గురించి ఎవరికీ తెలియని 8 విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.
1. శకునికి వందమంది మేనల్లుళ్లు మాత్రమే కాదు వందమంది సోదరులు కూడా ఉన్నారు.
గాంధారి తండ్రైన సుబలుడు గాంధార రాజ్యానికి రాజు. అతనికి వంద మంది కొడుకులుండేవారు. అందులో శకుని అందరికంటే చిన్నవాడు, బాగా తెలివైనవాడు. ఇంకా గాంధారి ఒక్కటే కూతురు.
2. శకుని చేతిలో ఉండే పాచికలు దంతాలతో చేయబడ్డాయి.
శకుని దగ్గర ఉండే పాచికలు అతడి తండ్రి అయినా సుబలుడు తొడ ఎముక తో చేయబడినవి అని చెబుతారు. కానీ అవి దంతాలతో చేయబడ్డాయి. ఇలా తయారుచేయబడినవి కనుకే శకుని పాచికల ఆటలో తన మాయని ప్రదర్శించి ఆటలో గెలిచేవాడని చెబుతారు.
3. శకునికి పాండవులతో ఎలాంటి శత్రుత్వం అనేది లేదు.
శకుని తండ్రి సుబలుడు కొన ఊపిరితోఉన్నప్పుడు వారి కుటుంబాన్ని చెరసాలలో వేసి హింసించి రోజుకి ఒక్క మెతుకు మాత్రమే పెడుతూ మరణించేలా చేస్తూ దుర్మార్గమైన చర్యకు పూనుకున్న ధృతరాష్ట్రుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, అతని వంశాన్ని పూర్తిగా నాశనం చెయ్యాలని తన చిన్న కొడుకు అయినా శకుని చేత ప్రమాణం చేయించుకున్నాడు. అలాగే తన శరీరంలోని ఏదైనా ఎముకను తీసుకుని పాచికలు తయారు చెయ్యాలని సూచించాడు. ఆ పాచికలు తను ఎలా కోరుకుంటే అలానే చూపిస్తాయాని శకునితో సబలుడు చెప్తాడు. తండ్రి తనకు చెప్పిన మాటలే శకుని తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. చివరికి అతని తండ్రికిచ్చిన మాటను నెరవేర్చుకున్నాడు. తన పాచికల మహిమతో పాండవులు కౌరవుల మధ్య గొడవలకు కారణమయ్యాడు. అందుకే పాండవుల పైన శకునికి ఎలాంటి శత్రుత్వం లేదు, కౌరవ వంశాన్ని నాశనం చేయడమే అయన లక్ష్యం.
4 . శకుని ఇంద్రజాలికుడు.
పాచికల ఆట అనేది మహాభారతం నుండి వచ్చింది. శకునిది ఇందులో ఒక మాస్టర్ మైండ్. శకుని యొక్క ఇంద్రజాల ఉపాయల వలన యుధిష్తిరా తన భ్రమని కోల్పోయాడు.
5. శకునికి ఇద్దరు కుమారులు.
శకునికి ఉలూక, వ్రికాసుర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే బీష్మపితామహనీ మరియు కురువంశాన్ని అంతం చేసిన తరువాతే గాంధర్వ రాజ్యంలోకి రావాలని శకుని వారితో ప్రతిజ్ఞ చేయించాడని చెబుతారు.
6. శకుని సహదేవుని చేతిలో మరణించాడు.
ద్రౌపతిని అవమానించినప్పుడు, దానికి ప్రతీకారంగా శకుని చంపుతానని ప్రతిజ్ఞ చేసిన సహదేవుడు మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో 18 వ రోజున శకుని సంహరిస్తాడు.
7. శకునికి కేరళలో ఒక దేవాలయం ఉంది.
కేరళ రాష్ట్రము, కొల్లం జిల్లాకి కొంత దూరంలో మళనాడు ప్రాంతంలో పవిత్రేశ్వరం అనే గ్రామంలో శకుని యొక్క మంచి లక్షణాలు గుర్తించి కురువర్ సమాజానికి చెందిన వారు ఇక్కడ అతడికి ఒక ఆలయాన్ని నిర్మించారు.
8. ప్రతీకారం, పగ అంటే గుర్తుకు వచ్చేది శకుని.
కౌరవుల చిన్నతనం నుండే శకుని వారి ఆలోచనలు మారుస్తూ పూర్తిగా చెడు మార్గంలో నడిపిస్తుంటాడు. ఇక మేనమామ అయినా శకుని ఏది చెప్పిన కౌరవులు దానివల్ల కలిగే అనర్దాలు ఏం ఆలోచించకుండా అయన మాటకి ఎప్పడు గౌరవిస్తుండేవారు. అయితే శకుని కౌరవుల పక్షాన ఉండటం వెనుక అసలు కారణం మాత్రం కురువంశాన్ని లేకుండా నాశనం చేయడమే.
శకుని గురించి మంచి ఎంత చెడు ఎంత అనేది పక్కన పెడితే. శకుని లాంటి మామ మహాభారతంలో తప్ప మరెక్కడా ఉండడు.