Meet The Hyderabadi Who Was Awarded From Youth Assembly For His Incredible Service

ఇప్పుడున్న రోజుల్లో యువతని మీ లక్ష్యం ఏంటి అని అడిగినప్పుడు ఎక్కువ మంది నుంచి వచ్చే సమాధానం మంచి జాబ్, లక్షల్లో జీతం, కుదిరితే ఫారెన్ లో ఉన్నత విద్య, విలాసవంతమైన జీవితం అని అంటారు. అయితే ఇవన్నీ ఉన్న వీటన్నింటినీ వదిలి సమాజానికి సేవ చేసే మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటివారిలో ముందు వరుసలో ఉంటారు సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి.1 - Akhilesh Reddy

మన హైదరాబాదీ అయిన అఖిలేష్ ఎమ్.ఎస్ చెయ్యటానికి అమెరికా వెళ్లి, అక్కడ లక్షల్లో జీతం వస్తున్న వదిలి, పుట్టిన దేశం కోసం, ఇక్కడున్న ప్రజలని, యువతని చైతన్యపరిచేందుకు మన దేశానికి వచ్చారు. చిన్నపటినుంచి సమాజానికి చేతనైన సాయం చెయ్యాలనే ఆలోచన కలిగిన అఖిలేష్, ఆ దిశగా ఎన్నో ప్రణాళికలు రూపొందించుకున్నారు.అమెరికాలో డేటా ఇంజనీర్ గా పనిచేస్తూ అక్కడికి వచ్చే వివిధ దేశాల వారితో ఆలోచనల్ని పంచుకుంటూ, మార్పు మనలోనే మొదలవుతుంది, ఆ మార్పు నేనే ఎందుకు కాకూడదని ఇక్కడికి వచ్చారు అఖిలేశ్.2 -akilesh youth award

ఆయన మొదట ఇక్కడ చేద్దామని వేసుకున్న ప్రణాళిక 100 రోజుల్లో 100 స్కూళ్లు. అనుకున్నదే తడవుగా కొన్ని అవాంతరాలు ఎదురైనా వెనకడుగు వెయ్యకుండా విజయవంతంగా వేల మంది విద్యార్థులకు విలువైన సూచనలు, సలహాలు, వ్యక్తిత్వ వికాసంలో నైపుణ్యాలను తెలియజేశారు. ఈయన అమెరికాకి వెళ్ళింది కూడా అక్కడ పరిస్థితులను గమనించి అవి మన దేశానికి ఏ విధంగా ఉపయోగ పడతాయి అని తెెెలుసుకోవటానికె. పర్యావరణం పై ప్రేమతో ప్రతీ మనిషి వంద మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని చెప్పటమే కాకుండా ఆచరించి చూపించారు.3 - award

మౌలిక వసతులు లేని స్కూల్స్ లో సదుపాయాలు కల్పించటం, విద్యార్థులు చదువుకోవటానికి కావలసిన వస్తువులను సమకూర్చడం, వారికి ఆర్థికంగా సహాయం చేయడం వంటి ఎన్నో గొప్ప పనులును చేశారు అఖిలేష్. కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గోల్స్ ఆన్ వీల్స్ అనే సంస్థ ద్వారా యువతను చైతన్య పరుస్తున్నారు. అఖిలేష్ చేసిన మంచి పనులను‌ గుర్తించి ఐక్యరాజ్యసమితి వారు తాము వివిధ దేశాల వారితో నిర్వహించిన సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానించగా ఆ సదస్సులో పాల్గొని తన విలువైన సూచనలు అందించారు. ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీలో రెండు సార్లు పాల్గున్న తక్కువ మంది భారతీయులలో అఖిలేష్ ఒకరు. యువతతో నే ప్రపంచ మార్పు సాధ్యం అని నమ్మే అఖిలేష్, అమెరికా, నైజీరియా, మలేసియా వంటి మిగిలిన దేశ యువతతో కలిసి ఒక టీమ్ ప్రారంభించబోతున్నారు. ఇటీవల Simona – Mirela Misculescu అనే Representative of the UN secretary – General and Head of the UN Office in Belgrade నుండి “outstanding youth delegate” అవార్డ్ అందుకున్నారు. ఇలా ఇంకా మరెన్నో అవార్డులు అందుకుంటూ, ఇంకెన్నో మంచి పనులతో మన దేశ, ప్రపంచ యువతకు ఆదర్శంగా నిలుస్తూ తాను కలగన్న మార్పు త్వరలోనే రావాలని ఆశిద్దాం…

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR