కుంతీదేవికి వాయుదేవుని వరప్రసాదంగా భీముడు జన్మించాడు. మహాభారతంలోని కొన్ని సంఘటనల ఆధారంగా భీముడు బలశాలి మాత్రమే కాదు మంచి మనసు ఉన్న వాడు. భీముడు అన్యాయాన్ని అసలు సహించడు. మరి మహాభారతంలో భీముడి గొప్పతనం ఏంటనే కొన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పంచపాండవులలో రెండవ వాడు భీముడు. మహాభారతంలో శ్రీకృష్ణుడి తరువాత ముఖ్యుడు భీముడు. ఒక రోజు కుంతీదేవి భీముడు పసి బాలుడిగా ఉన్నప్పుడు ఆయన్ని ఎత్తుకొని వనదేవతని దర్శించడానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఒక పులి రావడం చూసి బయపడిన కుంతీదేవి చేతి నుండి భీముడు ఒక కొండ రాయిపైన పడగ పసిబాలుడు అయినా భీముడికి ఎం అయిందో అని చూడటానికి వెళ్లగా భీముడు పడిన రాయి ముక్కలు ముక్కలుగా అయింది. ఇక భీముడు అంటే ఈర్ష్య ఉన్న దుర్యోధనుడు విష సర్పాలతో కాటు వేయించి, నదిలో పడివేసినప్పటికీ అందులో నుండి బయటకి వచ్చాడు. అందుకే భీముడిని వజ్ర కాయుడు అని అంటారు.
మహాభారతంలో మొదటగా, చివరగా యుద్ధం చేసింది భీముడే అని చెబుతారు. లక్క ఇంటికి కాపలాగా ఉన్నప్పుడు రాక్షస సోదరి అయినా హిడింబిని భీముని పైన మనసు పారేసుకున్నపుడు ఆమెని అంగీకరించమని కుంతీదేవి, ధర్మరాజు ఒక మాట చెప్పగానే వారి మాటకి గౌరవం ఇచ్చి ఆమెని వివాహం చేసుకున్నాడు. భీముడు, హిడింబిని యొక్క సంతానమే ఘటోత్కచుడు.
మహాభారత యుద్ధంలో మొత్తం 11 అక్షౌహిణుల సైన్యం ఉండగా అందులో 6 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్క భీముడే సంహరించాడట. భీముడు ముష్టి యుద్ధం చేసి ఎంతో బలవంతులుగా చెప్పుకునే రాక్షసులను మట్టుబెట్టాడు. బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు, హిడింబాసురుడు వంటి రాక్షసుల వదనే అందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
భీముడి పౌరుషం గురించి చెప్పాలంటే, ధర్మరాజు జూదంలో ఓడిపోగా వారి ముందే నిండు సభలోకి ద్రౌపతిని ఈడ్చుకు వస్తే పాండవులంతా మౌనంగా ఉన్న సమయంలో ఉన్నపుడు పట్టరాని కోపంతో భీముడు, దుర్యోధనుడి తొడని కొట్టి ఆ రక్తంతో ద్రౌపతి కురులను ముడి వేస్తానని ప్రతిజ్ఞ చేసి, చివరికి తన పౌరుషాన్ని నిలబెట్టుకుంటాడు.
పాండవులలో భీముడు రెండవ వాడైనప్పటికీ మొదటి వివాహం భీముడికే హిడింబి తో జరిగిందని చెబుతారు. ఇలా మహాభారతంలో భీముడి గురించి ఎన్నో కథలు ఉన్నాయి