పరమాత్మకు ప్రతి రూపం దీపం. ఆ కారణంగానే దేవుడికి పూజ చేసేముందు దీపాన్ని వెలిగిస్తుంటారు. ఇంకా దీపాన్ని వెలిగించడం అంటే ప్రాణం పోయడం అని కూడా అంటారు. అందుకే ఏ పని చేసిన జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు. మరి దీపాన్ని ఎలా వెలిగించాలి? దీపాన్ని వెలిగించడం వలన లాభం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన వెలిగించే రెండు వొత్తుల దీపం బ్రహ్మ స్వరూపంగా, దేవి రూపంగా భావిస్తారు. ఇంటిలో లేదా గుడిలో రెండు వొత్తుల దీపాన్ని వెలిగించడం వలన మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ప్రతి గురువారం, శుక్రవారం 5 లేదా 6 గంటల లోగ దీపాన్ని వెలిగిస్తే ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ప్రతి సోమవారం రుద్రాభిషేకం చేసే ముందు రెండు ఒట్టులతి దీపారాధన చేయాలి. ఇలా చేసే సమయంలో శివపంచాక్షరీ మంత్రం పఠిస్తే ఆయురారోగ్యాలు, జ్ఞాన సంపత్తి లభిస్తాయి. ఇంకా వ్యాపారం చేసేవారు ప్రతి పౌర్ణమి రోజున రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది. చెంచలమైన మనసు ఉన్నవారు ఇలా దీపారాధన చేస్తే మనసు నిలకడగా మారుతుంది. ఇంట్లో భార్యాభర్తల మానసిక ఆందోళనలు తొలగిపోతాయి.
అయితే ఒత్తిని నూనెలో తడిపి వెలిగించి, దానితో రెండు ఒత్తులను వెలిగించాలి. ఉదయంపూట తూర్పు దిశగా రెండు ఒత్తులు ఉండేటట్లు దీపము యొక్క ముఖం ఉండాలి. సాయంత్రము పూట ఒక ఒత్తి తూర్పుగా,రెండవది పడమటగా ఉండాలి. ఇంకా స్త్రీలు ఓంకారాన్ని జపించకూడదు. ఇంకా దీపాన్ని నోటితో ఆర్పకూడదు. ఒక దీపం వెలుగంచి, రెండవదీపాన్ని మొదటిదీపంతో వెలిగించకూడదు. దీపం వెలిగించి వెంటనే బయటికి వెళ్లకూడదు.
ప్రతి ఇంట్లో కూడా రోజు పూజలు అనేవి చేస్తుంటారు. అయితే శనివారం రోజున ఎవరైతే ఇంట్లో పూజ మందిరంలో లేదా గుడిలో నూనెతో దీపం వెలిగించరో వారి పైనుండి శనీశ్వరుడు దివ్య దృష్టిని తొలిగించుకుంటాడు. కావున శనివారం రోజున ఒక పూటైనా దీపం వెలిగించడం మంచి పద్ధతి అని చెబుతున్నారు.