కూతురు- “నాన్న..త్వరగా తిరిగిరా..”
తండ్రి – “నీ తండ్రి దేశం కోసం పోరాడడానికి వెళ్తున్నాడు.. గర్వంగా ఉండు… వచ్చేస్తాను..”
కూతురు తండ్రి తిరిగి వస్తాడని హాయిగా పడుకుంది..
నాన్న – “చిన్నా.. మనం పుట్టిన ఈ దేశానికి సేవ చేసుకునే సమయం వచ్చింది.. వెళ్లు.. ధైర్యంగా పోరాడు…”
కొడుకు–“నా దేశంలో ఎవరికి ఏమి అవ్వనివ్వను నాన్న.. వెళ్ళొస్తా..”
అలా వెళ్ళిన కొడుకు తిరిగి రావాలని కోరుకున్న.. ఉగ్రవాద దాడిలో అనంతలోకంలోకి వెళ్లారు..
వాళ్ళ శవాన్ని తీసుకొని వచ్చాక.. తండ్రి కళ్ళలో కన్నీళ్ల భగభగ మండాయి.. బాధతోకాదు.. గర్వంతో.
కూతురు తండ్రి తిరిగి వస్తాడని హాయిగా పడుకుంది..
ఆక్కడికి వచ్చిన ప్రజలతో ఆ తండ్రి..
“మీరు దేశం కోసం ప్రాణాలు తాగ్యం చేస్తారా…?”
“చేస్తాము”…”చేస్తాము.”.అంటూ ప్రజలు తండ్రితోపాటు నడిచారు…
అయితే నాతోపాటు అనండి…
“జైహింద్… జైహింద్..”
అంటూ కన్న కొడుకునీ ఆకరిసారి చూసుకుని తిరిగి వెళ్ళిపోయడు..
కడుపు మండుతుంది..ఆకలితో కాదు.. పగతో…
ఒకవైపు అప్పుడే పుట్టిన బిడ్డ వేదన..
ఇంకోవైపు కన్న తండ్రి రోదన..
ఆపేదెలా… బాధను దిగమింగేదెలా..
బిడ్డకు తెలీదు తండ్రి తిరిగిరాడని..
తండ్రికి తెల్సు బిడ్డ తిరిగి రాలేదని..
ఆపేదెలా… వారికన్నీరుని దాచేదెలా.
నలభై కుటుంబాల ఆర్తనాదాలు వృధాకానివ్వకుండా..
నూటనలభైకోట్ల సైనికుల్లా.. తెగపడుదాం…
నేలతల్లి మురిసిపడేలా.
ఉందాం.. వారికిఅండాదండగా.. మనదేశంలా.. లేదు, మరి ఉండబోదుమరొకదేశం..
మనంఏకులానికిమతానికిచెందమ్..
మనమంతా భరతమాత ముద్దుబిడ్డలం..
ఎదిరించుదాం ఈ ఉగ్రవాద అన్యాయాన్ని..
కాపాడుదాం మనదేశాన్ని…
ఈరోజు కాకపోతే ఇంకెప్పుడు..
రండి.. కదలిరండి..
ఆ దేశమే కాదు..ప్రపంచమే భయపడేలా..
చూపిద్దాం మన ధైర్యాన్ని..చాటుదాం మన ఐకమత్యాన్ని..
జైహింద్…