సాయంత్రం అయితే ఆ గుడికి వెళ్ళడానికి భయపడతారు ఎందుకు ?

మన గుడికి ఉదయం లేదా సాయంత్రం వెళ్లి దేవుడి దర్శనం చేసుకొని వస్తుంటాం. కానీ ఈ ఆలయానికి మాత్రం సాయంత్ర సమయంలో వెళ్ళడానికి అక్కడి స్థానికులు భయపడిపోతున్నారు. ఎందుకంటే ఆ గుడిలో ఆత్మ తిరుగుతుందని, రాత్రి అయితే గుడి నుండి ఏవో శబ్దాలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఎందుకుఆ గుడికి సాయంత్రం వెళ్ళడానికి భక్తులు బయపడుతున్నారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

athma tirige alayamమధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లాలో దుర్గ దేవాలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా చెబుతారు. అయితే ఈ ఆలయం నుండి రాత్రి సమయాలలో సింహం గర్జించినట్లు శబ్దాలు వినిపిస్తున్నాయని, గంటలు ఎవరో కొడుతున్నట్లుగా శబ్దాలు వినిపిస్తున్నాయని, తెల్ల చీర ధరించి ఎవరో అమ్మాయి ఆత్మ తిరుగుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అందుకే ఈ ఆలయానికి సాయంత్రం వెళ్ళడానికి భక్తులు భయపడుతున్నారు.

athma tirige alayamఇక విషయంలోకి వెళితే, పూర్వం ఈ ఆలయాన్ని మహారాజ్ దేవాస్ నిర్మించారు. ఈ ఆలయం నిర్మించిన కొంతకాలానికి ఆ రాజు కుమార్తె ఈ ఆలయంలో ఆత్మహత్య చేసుకొని మరణించింది. యువరాణిని ప్రేమించిన ఆ రాజ్య సేనాధిపతి కూడా ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గుడిలో యువరాణి చనిపోవడంతో ఆలయం అపవిత్రమైందని ఆలయ పూజారి రాజుకు చెప్పగా, అప్పుడు ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఉజ్జయిని లోని గణపతి ఆలయంలో ప్రతిష్టించారు.

athma tirige alayamఇక ఈ ఆలయం ఒకప్పుడు ఎంతో గొప్ప విశిష్టత కలిగిన ఆలయమని చెబుతుండగా, ఈ ఆలయం శాపగ్రస్తమైనదని, ఆలయంలో ఆత్మ తిరుగుతుందని, ఏవో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయని ఇలా ఎన్నో రకాల వాదనలు అనేవి ఈ ఆలయం గురించి ఉన్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR