వేల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ ఆలయంలో రోజు రోజుకి పెరుగుతున్న హనుమంతుడి విగ్రహం

ఆంజనేయుడిని బజరంగబలి, మారుతి, అంజనిసుతుడు, హనుమంతుడు అని అనేక పేర్లతో కొలుస్తుంటారు. అయితే అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అనీ, వాయుదేవుని ద్వారా పుట్టినవాడు కాబట్టి పవనకుమారుడు అనీ పిలుచుకుంటారు. ఇంకా అంజనాదేవి భర్త పేరు కేసరి కాబట్టి, కేసరీనందనుడు అని పిలుస్తారు. ధర్మ రక్షణ కోసం రాముడు జన్మిస్తే అయన నమ్మిన బంటు హనుమంతుడు ధర్మ సేవ కోసం అవతరించాడు. ఇది ఇలా ఉంటె, అతిపురాతన ఆలయంగా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయంలోని హనుమంతుడి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందట. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

hanuman templeతమిళనాడు రాష్ట్రం, నామక్కల్ అనే ప్రదేశంలో హనుమంతుడి ఆలయం ఉంది. ఈ ఆలయానికి కొన్ని వేలసంవత్సరాల చరిత్ర అనేది ఉండగా, అతిపురాతన ఆలయంగా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయంలో దాదాపుగా 20 అడుగుల హనుమంతుడి విగ్రహం అనేది ఉంది. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, హనుమంతుడి ఆలయ గర్భగుడికి పై కప్పు అనేది ఉండేది. ఇంకా ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే, ఇక్కడి హనుమంతుడి విగ్రహానికి ఎదురుగా లక్ష్మీనరసింహస్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు.

hanuman templeఇక ఈ ఆలయ గర్భగుడికి పై కప్పు అనేది ఎందుకు ఉండదు అంటే, స్వామివారి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందట. ఒకప్పుడు ఈ ఆలయ గర్భగుడికి పైకప్పు నిర్మించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ ఆలయ పై కప్పు అనేది కూలిపోయిందట. స్వామివారి విగ్రహం రోజు రోజుకి పెరుగుతున్నదని కనుకే ఆలయ పై కప్పు అనేది కూలిపోయిందని అక్కడి అర్చకులు చెబుతున్నారు.

hanuman templeఈ ఆలయ విషయానికి వస్తే, ఇక్కడ నామగిరి కొండలపైన నామక్కల్ అనే కోటను 16 శతాబ్దంలో రామచంద్ర నాయకర్ గారు నిర్మించారు. ఇక్కడి కమలాలం అనే చెరువు దగ్గర ఇప్పటికి హనుమంతుడి పాదముద్రలు మనం గమనించవచ్చు. అందుకే ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయస్వామి స్వయంభువు అని అందుకే స్వామివారి విగ్రహం రోజు రోజుకి పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక ఇక్కడి కోటలో శ్రీ మహావిష్ణువు ఆలయ శిధిలాలు ఉన్నవి. నామగిరి కొండ గుహలో నరసింహస్వామి, రంగనాథస్వామి ఆలయాలు ఉండగా, ఈ ఆలయాలలో కొండరాయితో చెక్కబడిన విగ్రహాలు ఉండటం విశేషం.

hanuman templeలక్ష్మీనరసింహస్వామికి అభిముఖంగా ఆంజనేయస్వామి విగ్రహం ఉండగా, హనుమంతుడి కన్ను నరసింహస్వామి వారి పాదాలతో సరళరేఖలో ఉంటుంది. ఇక్కడి హనుమంతుడి విగ్రహం కోటికి రక్షణగా ఉంటుందని, శత్రువుల బారినుండి రక్షిస్తుందని భక్తుల నమ్మకం. అయితే పూర్వం టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికీ దొరకకుండా ఇక్కడ ఉన్న కోటలోనే తలదాచుకున్నాడని చెబుతారు.

hanuman templeఈవిధంగా ఎన్నో విశేషాలు ఉన్న ఈ అద్భుత ఆలయానికి వచ్చి హనుమంతుడి దర్శనం చేసుకుంటే గ్రహ దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం మార్గశిర నెల తొలి నక్షత్రం రోజున స్వామివారికి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆ సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR