బేతాళుడు విక్రమార్కుని చెప్పిన కథ ఏంటి ?

బేతాళుడు అంటే శ్మశానంలో తిరిగేవాడని, మానవాతీత శక్తులు కలిగిన ఒక భూతం లాగా భావిస్తారు. అయితే ఉజ్జయిని రాజ్యానికి రాజైన విక్రమార్కుడు గొప్ప తెలివైన రాజు. ఒక యాచకుడు అర్ధరాత్రి ఒంటరిగా శ్మశానానికి వస్తే ఒక రహస్యం చెబుతానని చెప్పడంతో స్మశానానికి ఒక అర్ధరాత్రి ఒంటరిగానే వెళుతాడు. మరి విక్రమార్కుడు ఎందుకు వెళ్తాడు? బేతాళుడు విక్రమార్కుని చెప్పిన కథ ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Vikramarkuduఉజ్జయిని మహారాజైన విక్రమార్కుడి ఒక యాచకుడు రోజు ఒక పండు పంపించేవాడు. ఆ పండుని కొస్తే అందులో మని ఉండేది. అది చూసి ఆశ్చర్యానికి గురైన విక్రమార్కుడు ఆ యాచకుడిని కలవాలని అనుకోగా, ఆ యాచకుడు నెలలో 14 వ రోజు అర్ధరాత్రి ఒంటరిగా వస్తే కలుస్తానని కబురు పంపాడు. ఆ వింత ఎలా అయినా తెలుసుకోవాలనుకున్న విక్రమార్కుడు ఒంటరిగా వెళ్లి యాచకుడిని కలువగా, అతడు చెట్టు మీద ఉండే శవాన్ని తీసుకురమ్మని అలా తీసుకువస్తే నాకు అపారమైన క్షుద్ర శక్తి వస్తుందని చెప్పడంతో తీసుకువస్తానని మాట ఇస్తాడు.

Vikramarkuduవిక్రమార్కుడు ఒక చెట్టు మీద ఉన్న శవాన్ని తన భుజంపై వేసుకుని వస్తుండగా ఆ శవంలో బేతాళుడు ఉంటాడు. అయితే బేతాళుడు విక్రమార్కుడితో ప్రయాణం చేయాలంటే దారిలో ఏమి మాట్లాడకూడదు, ఇంకా బేతాళుడు ఒక కథ చెప్పి ఆ కథ నుండి ఒక క్లిష్తమైన ప్రశ్న అడిగితే దానికి సరైన సమాధానం చెప్పకపోతే విక్రమార్కుడి తల బద్దలవుతుంది. దానికి విక్రమార్కుడు అంగీకరిస్తాడు. అయితే బేతాళుడు మొత్తం 25 కథలు చెబుతాడు. అందులో ఒక కథ ఏంటంటే, పూర్వం విక్రమసింహుడు అనే రాజు ఉండేవాడు, ఆ రాజ్యంలో సారంగడు అనే ఒక యువకుడు పులితో పోరాడి విజయాన్ని సాధించాడని తెలిసి అతడిని తన అంగరక్షకుడిగా నియమించుకుంటాడు.

Vikramarkuduఒక రోజు రాజు ఇంకా ఆ యువకుడు కలసి వేటకు బయలుదేరి వెళ్లగా, అడవిలోకి చాలాదూరం వెళ్లిన తరువాత రాజుకి దాహం అవ్వగా సారంగడు గుర్రంపైన వెళ్లి దగ్గరలో నీరు ఎక్కడైనా ఉందొ చూసి వస్తానని చెప్పి వచ్చి దగ్గరలో ఒక సెలయేరు ఉందని చెప్పడంతో ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఒక దూత వచ్చి రాజుతో రహస్యంగా మాట్లాడి వెళ్లగా, రాజు సారంగడితో, నీవు నాకు చాలా నమ్మకస్తుడివి, నీకు నేను నీకు పని అప్పగిస్తున్నాను, వైశాలి రాజా కుమార్తె ఎంతో అందమైనది, తెలివైనది, గుణవంతురాలు, ఆమెని నేను వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను, నీవు వారి రాజ్యానికి వెళ్లి న గురించి చెప్పి ఆ రాణిని ఎలాగైనా ఒప్పించాలి అని చెప్పడంతో, రాజు ఆజ్ఞతో సముద్ర మార్గం గుండా పడవ ప్రయాణం చేస్తూ ఉండగా కొన్ని రోజులకి తుఫాను వచ్చి పడవ విరిగిపోగా అలలపైనా ప్రయాణిస్తూ ఒక ద్విపానికి చేరుకుంటాడు.

Vikramarkuduఅతనికి అక్కడ ఒక కాళీమాత ఆలయం కనిపించడంతో అక్కడికి వెళ్లి చూడగా అక్కడ కొందరు యువతులు పూజలు చేస్తూ ఉండగా అందులో అందరికంటే ఒక సౌదర్యవతిని చూసి సారంగడు ఆమెని వివాహం చేసుకోవాలని భావించి, అక్కడ ఉన్నవారితో ఎవరు మీరు అని అడుగగా, మేము నాగ కన్యలం, ఆమె మరాకుమారి అమృతవల్లి అని చెబుతారు. అప్పుడు అతడు ఆమెని వివాహం చేసుకుంటాని చెప్పడంతో అమృతవల్లి ముందు కోనేటిలో స్నానం చేసి రా అని చెప్పడంతో వెళ్లి కోనేటిలో మునుగగా, కుశస్థలి రాజ్యంలోని కాళీమాత ఆలయం లో ని కోనేటిలో తేలాడు. అప్పుడు ఆశ్చర్యపోయిన సారంగడు వెంటను విక్రమసింహ రాజుని కలసి జరిగిన విషయాన్ని వివరించాడు.

Vikramarkuduఅపుడు రాజు ఇంకా సారాంగుడు ఆ ద్విపానికి వెళ్లి నాగకన్యలా కోసం ఎదురుచూస్తుండగా, పూజ ముంగించుకున్న రాకుమారి, నేను రాజుని ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే వివాహం చేసుకుంటానని నాగకన్యలతో చెప్పించగా, రాజు వెళ్లి రాకుమారి వైశాలి రాకుమార్తెను ప్రేమించాను, నిన్ను ప్రేమిస్తున్న సారంగుని పెళ్లి చేసుకోమని వారి వివాహాన్ని జరిపిస్తాడు. ఇలా కథ చెబుతున్న బేతాళుడు రాజా ఇప్పుడు విక్రమసింహుడు, సారంగడు ఒకరికి ఒకరు ఉపకారం చేసుకున్నారు కదా ఇద్దరిలో ఎవరి ఉపకారం గొప్పదో చెప్పు అని అనడంతో, అప్పుడు విక్రమార్కుడు, బేతాళ, సారంగడు సేవకుడు తన రాజుని ఆదుకోవడం అతని ధర్మం, అది విధి నిర్వహణలో భాగం, రాజైన విక్రమసింహుడు సారంగడు అమృతవల్లి పెట్టుకున్న ఆశలు గుర్తించి, తనను చేపట్టిన స్త్రీని సారంగునికి ఇచ్చి వివాహం జరిపించడం మహాపకారం అన్నాడు. ఇలా బేతాళుడికి మౌనభంగం కావడంతో వెంటనే శవంతో లేచి చెట్టుపైకి వెళ్లిపోయింది.

ఇలా చివరకి 25 వ కథలో విక్రమార్కుడు జవాబు చెప్పకుండా ప్రయాణం పూర్తి చేసి ఆ యాచకుడి దగ్గరికి బేతాళుడిని చేర్చుతాడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR