శివుడి అతి ప్రాచీన ఆలయాలలో ఇది ఒకటిగా చెబుతారు. అప్పికొండ పైన వెలసిన ఏ ఆలయాన్ని కపిలకొండ అని కూడా అంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే గ్రానైట్ తో చేయబడిన ఒక పెద్ద నది విగ్రహం ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తుంది. మరి ఈ శివాలయంలో శివలింగం ఎందుకు అప్పుగా ఉండిపోయింది? దాని వెనుక కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, విశాఖ జిల్లాకి కొంత దూరంలో అప్పికొండ అనే గ్రామంలోని కొండపైన శ్రీ సోమేశ్వరాలయం ఉంది. దక్షిణ భారతదేశంలో అతి పురాతన శైవ క్షేతాల్లో అప్పికొండ ఒకటి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వెనుక సముద్ర తీరాన ఈ ఆలయం వెలిసింది. నిత్యం భక్తుల పూజలను అందుకునే ఈ శైవ క్షేత్రం ప్రాంగణలో అత్యంత పురాతన శివలింగాలు దర్శనమిస్తాయి.
ఇక పురాణానికి వస్తే, కపిల మహార్షి ఈ పుణ్య క్షేత్రానికి శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. విశ్వ ప్రదక్షిణలో భాగంగా ఈతూర్పు తీరానికి వచ్చిన కపిల మహర్షి 101 శివలింగాలను ప్రతిష్టాంచాలని భావించారట. కానీ ఓ లింగం ఇంకా మిగిలి ఉండగానే సూర్యోదయం అయిందని దీంతో ఓ లింగం అప్పుతో ఈ ప్రాంతం అప్పుకొండగా ఏర్పినట్టు భక్తులు చెబుతుంటారు. కాల క్రమంలో అప్పుకొండ అప్పికొండగా మారిందని కథనం ప్రచారం ఉంది. కాగా సముద్ర అలల తాకిడితో చాలా కాలం ఈ ఆలయం ప్రాంగణం సముద్రపు ఇసుకలో కప్పి ఉండిపోయాయి. ఆర్కియాలజీ విభాగం పరిశోధనల్లో గుర్తించడంతో రెండు దశాబ్ధాల క్రితం తవ్వకాల్లో అప్పికొండ బయటపడింది.
ఇంకా చాలా శివలింగాలు ఆలయం పరిసరాల్లో సముద్రపు ఇసుక లో ఉన్నట్టు మత్య్సకారులు చెబుతుంటారు. కాగా ఇక్కడ పురాతన వినాయకుడితో పాటు భారీ నందీశ్వరుడు కొలువుదీరి ఉన్నాడు. స్వామిని దర్శించి నందీశ్వరుని చెవిలో కోరిన కోర్కెలు చెబితే ఇట్టే తీరుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఆలయానికి శివరాత్రి సందర్బంగా వేల మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు.
ఆలయం ప్రాంగణంలో మరో రెండు శివలింగాలతో కూడిన ఉపాలయాలు ఉన్నాయి. వేల సంవత్సరాల నాటి ఈ ఆలయాలు సముద్రపు ఇసుకలో కప్పబడి ఉండటంతో కొంత శిధిలమయ్యాయి. అయితే ఈ ఆలయంలో ఆ నాటి శిల్ప కళ నైపుణ్యం మాత్రం అంతు చిక్కని శిల్పకళ గా చెబుతుంటారు.