శివున్ని లింగరూపంలో పూజించటం వెనుక గల పురాణం కథ !

పరమేశ్వరుడు.. హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. సృష్టి స్థితి లయకారుడైన మహాశివుడిని భక్తులు పరమాత్మగాను, ఆదిదేవునిగాను భావిస్తారు. శివ అనగా కల్మషము లేని వాడు అని అర్థం. జననమరణాలకు అతీతుడైన శివుడిని దేవతలు సైతం పూజిస్తారు. ఆదిదేవుని దేహంపై గల సర్పాలు భగవంతుని జీవాత్మలుగాను, ధరించిన పులి చర్మం అహంకారాన్ని త్యజించమని అర్ధం గానూ, ఆశీనంపైన పులిచర్మం కోరికలకు దూరంగా ఉండమని, భస్మం పరిశుద్ధత ప్రాముఖ్యతను సూచిస్తాయి.

lord shivaశివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే సామెత మనం వింటూనే ఉంటాం.. ఒక్క అభిషేకంతోనే కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమని విశ్వసిస్తారు ఆ మహాశివుని భక్తులు. భారతదేశంలో ఉన్న దేవాలయాలలో శివుని ఆలయాలే అధిక సంఖ్యలో ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఐతే ఇన్ని ఆలయాలలోనూ మహాశివుణ్ణి లింగ రూపంలోనే పూజిస్తారు గాని విగ్రహ రూపంలో పూజించారు.. మరి దీని వెనుకున్న పురాణకథ ఏంటి మనం ఇపుడు తెల్సుకుందాం..

2 Rahasyavaani 245శివ లింగము పరమాత్ముని సూచించే ఒక పవిత్ర చిహ్నం. శివ లింగాన్ని శక్తి సూచికగా పరిగణిస్తారు. శివుడిని లింగ రూపంలో పూజించటానికి గల చరిత్రను వరాహపురాణంలో పేర్కొన్నారు. కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన కథలో భృగు మహర్షి ఒకసారి మహా శివుడి దగ్గరకు వస్తాడు. ఆ సమయంలో శివుడు తాండవం చేస్తూ మహర్షిని పట్టించుకోకవడంతో ఆయన తీవ్ర ఆగ్రహానికి గురై శివుడిని శపిస్తాడు. ఈ రోజు నుండి నీ శివలింగాకారానికే కానీ నీ విగ్రహానికి పూజలుండవు, నీ ప్రసాదం నింద్యం అవుతుంది” అని శపించడం వల్ల అప్పటినుండి శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించి పూజించే ఆచారం మొదలైంది. అంతకుముందు వరకు శివుడు విగ్రహ రూపంలోనే పూజలు అందుకునేవాడని పురాణాలు చెబుతున్నాయి. దీనికి సంకేతాలుగా చాలా పురాతన ఆలయాల్లో మహాశివుని విగ్రహాలు చూడవచ్చు.. అయితే తరవాత భృగుమహర్షి శాపం వల్ల శివ లింగాన్ని శివుని ప్రతిరూపంగా భావించే సంప్రదాయం మొదలైంది.

ShivaLingamశివ లింగములో మూడు భాగాలు ఉంటాయి. బ్రహ్మ భాగము భూమిలో, విష్ణు భాగం పీఠంలో, శివ భాగం మనకు కనిపించే పూజా భాగముగా ఉంటుంది. శివ లింగాన్ని శిల్పులు ఆగమ శాస్త్రాలలో సూచించిన విధంగా సరైన సరైన రాతిలో గాని ఇతర పదార్ధాలతో నిర్మిస్తారు. శివాలయాలలో ప్రసాదం కంటే ఎక్కువ తీర్థం లేదా అభిషేక జలానే ఇస్తుంటారు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR