అరటిపండు.. అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ పండు.. రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. అయితే ఆపిల్ మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్న మనం ఆరోగ్యంగా జీవించవచ్చు. అన్ని సీజన్లలో లభించే ఈ అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక రకాల రోగాల బారి నుండి బయటపడవచ్చు. అరటి పండ్ల రంగూ, రుచి, వాసన అవి పక్వానికి వచ్చే దశలో ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోవడం వల్ల వీటిని రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతకు పెట్టరు.. ఆలా పెడితే మగ్గి నల్లగా అవుతాయి.. అరటిలో పిండిపదార్థాలు, కార్బోహైడ్రేటులు ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1 గ్రాము మాంసకృత్తులు అంటే ప్రోటీనులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అంతే కాదు అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.
అరటి చెట్టులోని కాండం, ఆకులు, పువ్వులు కూడా మనకి మేలుచేసేవే.. అరటి పువ్వును వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగమైన దూట కూడా వంటలలో ఉపయోగిస్తారు – అరటి పూవు తింటే జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమముగా పనిచేసేటట్లు చేస్తాయి.. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.. ఆడవారిలో బహిస్టుల సమయంలో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును. అలాగే మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడుతుంది.. ఇక అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. కొన్ని ప్రాంతాలలోవీటిని వంటకాలు చుట్టడానికి ఉపయోగిస్తారు. అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అరటిపండులో 74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి.
అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలకు మరియు దంతాలకు చాలా మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడం వల్ల మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు నుండి తప్పించుకోవచ్చు అని ఒక అధ్యయనంలో తేలింది.
ఈ పండ్లలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగులను ఉత్తేజితం చేసి జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటికి ఎయిడ్స్ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే ‘బాన్‌లెక్’ అనే రసాయనం ఎయిడ్స్ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్ నిరోధానికి వాడుతున్న ‘టీ20, మారావిరాక్’ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది..అరటిలోని లెక్టిన్ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.