సుమారు 800 సంవత్సరాలనాటి మర్రి వృక్షం గురించి ఆశ్చర్యకర విషయాలు

ఆ చెట్టుకు 8 వందల సంవత్సరాల వయసు. దేశంలోనే మూడవ అదిపెద్ద మర్రిమామగా పేరుగాంచిన ఈ చెట్టు పేరు పిల్లలమర్రి. ఈ చెట్టు మనలో చాల మందికి సుపరిచితమే. మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి, మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ మహావృక్షాన్ని చూడడానికి దూర ప్రాంతాలనుంచి యాత్రికులు తరలివస్తుంటారు. ముఖ్యంగా డిసెంబర్, జనవరి మాసాలలో పాఠశాల, కళాశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి మహా వృక్షాన్ని సందర్శిస్తారు.

Pillalamarri Banyan Treeసుమారు 800 సంవత్సరాలనాటి ఈ మర్రి వృక్షం దూరం నుంచి చూస్తే దట్టమైన చెట్లతో నిండిఉన్న చిన్న కొండలాగా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా కనిపిస్తుంది. ఈ మహావృక్షం వైశాల్యాన్ని కొలవాలంటే అడుగులు, మీటర్లు బొత్తిగా సరిపోవు. ఇది మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించింది. మర్రికి పిల్లలు అంకురించడంతో ఇది పిల్లల మర్రిగా మారింది. వందల సంవత్సరాల నుంచి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని నిలబడి ఇది మహావృక్షమైంది.

Pillalamarri Banyan Treeఈ చెట్టు యొక్క ప్రధాన కాండం ఎక్కడుందో చెప్పడం కష్టం. దీని పుట్టుకకు సంబంధించిన ఆధారాలు కూడా లేవు. ఇటీవల కాలంలో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందడం వల్ల ఇక్కడి ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి. విహార యాత్రకు వచ్చే వారి కోసం ఇక్కడ మినీ జూ పార్కు ఏర్పాటు చేసారు. రకరకాల పక్షులు, నెమళ్ళు, కుందేళ్ళు, కోతులు లాంటివే కాకుండా, చేపల అక్వేరియం కూడా పర్యాటకులను ఆకట్టుకొంటున్నది. వర్షాకాలంలో అయితే చక్కగా బోటు షికారూ చేయవచ్చు. అందుకు అవసరమైన సౌకర్యాలున్నాయి.

Pillalamarri Banyan Treeదగ్గర్లోనే పిల్లల కోసం ఆటస్థలం, సందర్శకులకై పురావస్తు మ్యూజియం కూడా ఏర్పాటు చేసారు. పిల్లల మర్రి మ్యూజియాన్ని 1976లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో లభ్యమైన కమనీయ శిల్పాలను పురావస్తుశాఖ మ్యూజియంలో ఉంచారు. వివిధ పురాతన కాలాల్లో పరిణామం చెందిన శిల్ప శైలిని, అప్పటి మానవులు ఉపయోగించిన వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో పొందుపర్చారు. క్రీ.శ.7 వ శతాబ్ది నుంచి 15 వ శతాబ్ది శిల్ప పరిణతిని చాటే అపురూప శిల్పాలున్నాయి.

Pillalamarri Banyan Treeహిందూ, బౌద్ధ, జైన మత ధోరణులకు అద్దం పట్టే అనేక శిల్పాలు ఇక్కడ ఉన్నాయి. రెండు వేల సంవత్సరాల కాలం నాటి మధ్య రాతి యుగానికి చెందిన శిథిలమైన వస్తువులు షోకేసుల్లో భద్రపర్చారు. చాళుక్యుల కాలం నుంచి విజయనగర కాలం నాటి వరకు రూపుదిద్దుకున్న అనేక శిల్పాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి. ఎన్నో తరాలను చూసి ఎన్నో అనుభవాలను తనలో దాచుకున్న ఈ ఘన వృక్షం పిల్లలమర్రి చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి అని నిరూపించింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR