రాధ కృష్ణుడితో చివరి వరకు ఎందుకు లేదు? బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తరువాత ఏమైంది?

యుగాలు మారినా ప్రపంచంలో మారనిది ప్రేమ భావన ఒక్కటే. ఈ భూమి మీద మానవులు ఉన్నంత కాలం ప్రేమ కూడా ఉంటుంది. ప్రేమకునిర్వచనం ఏమిటని ఎవరైనా అడిగితే ‘‘రాధకృష్ణులు’’ అని చెబుతారు. ప్రేమంటేనే రాధ. రాధంటేనే ప్రేమ. ఇంతకు మించిన నిర్వచనం ప్రపంచంలోనే లేదు. అలాంటి రాధ కృష్ణుడితో చివరి వరకు ఎందుకు లేదు? బృందావనంలో కృష్ణుడితో ఉన్న రాధ తరువాత ఏమైంది? రాధకృష్ణులు దూరం అవడానికి కారణం ఏంటి ?

radha krishnuluబ్రహ్మవైవర్త పురాణం ప్రకారం కృష్ణుడు, రాధ వారి పూర్వ జీవితంలో గోలక్‌లో నివసించేవారు. ఒకరోజు కృష్ణుడు భార్య అయిన వీర్జతో కలిసి తోటలో కూర్చున్నాడు. వీరిద్దరిని పక్కపక్కనే చూసిన రాధకు కృష్ణుడిపై కోపం వచ్చింది. ఆయనతో గొడవపడింది. ఈ గొడవ వీర్జకు నచ్చలేదు. ఆ కోపంతో వీర్జ ఒక నదిగా మారి ఎప్పటికి కృష్ణుడి దరి చేరకూడదని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. దీంతో కృష్ణుడు నిరాశ చెందాడు. రాధ కూడా కృష్ణుడితో మాట్లాడకుండా దూరంగా ఉండిపోయింది. వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా రాధ మనసు కరుగలేదు.

radha krishnuluకృష్ణుడు, శ్రీదాముడు మంచి మిత్రలు. ఒకరంటే ఒకరికి ఇష్టం. వీరు స్నేహానికి మారుపేరులా ఉంటారు. అయితే.. రాధ, కృష్ణుడుపై గొడవ పడ్డ విషయం దామునికి తెలిసింది. దాముడు రాధకు నచ్చచెప్పాలని చూశాడు. అయినా రాధ ఏ మాత్రం చలించలేదు. పైగా కృష్ణుడిని తిట్టుడంతోపాటు, దామునిని కూడా తిట్టసాగింది. ఇది దామునికి మరింత కోపాన్ని తెచ్చింది. కోపానికి గురైన దాముడు మరుసటి జన్మలో కూడా ప్రేమించిన వారిని వివాహం చేసుకోలేదు అని రాధను శపించాడు. ఈ శాపం కారణంగా కృష్ణుడు రాధకు దూరం అవుతాడు.

radha krishnuluకంసుడు కృష్ణుడిని మధురకు తీసుకురమ్మని అక్రూరుడిని బృందావనం పంపుతాడు. గోపికలంతా ఏడుస్తూ వెళ్లవద్దని కోరతారు. వారిని ఎలాగో తప్పించుకుని కృష్ణుడు వ్రేపల్లె వెళతాడు. అక్కడ కేవలం 5 నిముషాలు మాత్రమే ఉంటాడు. ఇద్దరూ మౌనంగా ఒకరినినొకరు చూసుకుంటారు. రాధఒక్క ప్రశ్న కూడా కృష్ణుడిని అడగదు. అతను వెళ్లవలసిన అవసరం ఏమిటో ఆమెకు బాగా తెలుసు. అంతేకాదు భౌతికంగా దూరంగా ఉన్నా కృష్ణుడి నుంచి తాను దూరం కానని కూడా ఆమెకు తెలుసు. వారిద్దరి మనసులూ ఎప్పుడో కలిసిపోయాయి. అలాంటప్పుడు మాటలతో వారికేం పని?

radha krishnuluకృష్ణుడు కంసుడిని చంపుతాడు. మరికొంత కాలానికి శిశుపాలుడిని చంపుతాడు. ఇతర అనేకానేక మంది రాక్షసులను సంహరిస్తాడు. మధురను చక్కదిద్దుతాడు. కొంతకాలానికి ద్వారకను నిర్మించి కృష్ణుడు అక్కడకు మారిపోతాడు. అలా ఏళ్లు గడుస్తాయి. మరి రాధ ఏమైంది? ఆమె నిరంతరం కృష్ణుడిని ధ్యానిస్తూ అతన్నే మనసులో నిలుపుకుని సదా అదే స్మరణలో జీవిస్తూ ఉంటుంది. అది చూసి భయపడిన ఆమె తల్లి రాధకు బలవంతంగా పెళ్లి చేస్తుంది. తల్లి కోరిక మేరకు రాధ పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కంటుంది. కానీ తాను చనిపోయే సమయం వరకు ఆమె ప్రేమ అలాగే పవిత్రంగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR