మనిషి హిందువై పుట్టిన తరువాత జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఒక్కసారైనా తలనీలాలు ఇచ్చి తీరుతాం. చివరకు తల్లిదండ్రులు ద్వారా పుట్టెంట్రుకులైన దేవుడి సమర్పించి ఉంటారు. ఇలవేల్పుకు తలనీలాలు ఇవ్వడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆచారం. అసలు తలనీలాలు ఎందుకివ్వాలి? దానివలన లాభం ఏంటీ? కేవలం మొక్కు అనుకునే దాని వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకోండి.
పురాణాల ప్రకారం మనిషి చేసే ప్రతి పాపపు పని యొక్క ఫలితం ఆ మనిషి జుట్టుకు చేరుతుంది. మనం చేసిన పాపాలు అన్ని మన శిరోజాలలో చేరి మన తలలో తిష్ట వేసి కూర్చుంటాయి. అందుకే దైవ సన్నిధిలో ఆ పాపాలను వదిలి వాటి యొక్క చెడు ఫలితాలు తమతో ఉండొద్దని అందరూ తలనీలాలు సమర్పిస్తారు.
ఇక శిశువు తల వెంట్రుకలతోనే జన్మిస్తాడు. ఈ వెంట్రుకలు పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు సంబంధించినవై ఉంటాయి. ‘శిరోగతాని పాపాని’ అని వేదాలు చెబుతాయి. అంటే పాపాలను కలిగివున్నందునే శిరోజాలను అంటారు. కేశఖండనతో సర్వ పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహించడానికి ఇదే కారణం.
దేవుని దగ్గర శిరోజాలు తీస్తే మన శరీరం చాలా తేలిక అవుతుంది. దానికి కారణం మన పాపాలు ఒక్కసారిగా తొలగిపోవటం వలనే అలా జరుగుతుందిని మన శాస్రాలు అంటున్నాయి.