Contributed By: Chintapalli Siva Santhosh
జానపద సరస్వతి కనకవ్వ…
మట్టి లో మాణిక్యం ఆమె, పల్లెటూరులో పుట్టిన సంగీత సరస్వతి ఆమె, కేవలం పదిమంది గుంపులో పాడిన గొంతు, నేడు తెలుగు రాష్ట్రాలు లో మారు మోగుతున్న పాటలే పేరే గొట్టె కనకవ్వ… ఒక్క మాటలో చెప్పాలంటే జానపద కోకిల.. ఆ గొంతులో ఎదో మాయ ఉంది, లేకపోతే ఎప్పుడో మరిచిపోయిన జానపద పాటలు తిరిగి మళ్ళీ మళ్ళీ వింటున్నాం. పండుగ వస్తే ఆమె పాటే, కుర్రకారు చిందు వేయాలంటే ఆమె పాటే అంతా జోరు హోరు అమె పాట. ఆమె గొంతులో పల్లెల గుండె చప్పుళ్ళు వినిపిస్తాయి, కనకవ్వ అరవై సంవత్సరాల ఈ సంగీత సరస్వతి సిద్దిపేట జిల్లా లోని అక్కన్నపేట మండలం బుడుగుపల్లి గ్రామంలో పుట్టింది.తన తల్లి నుంచి కధలు విని,విన్న కధలను పాటలుగా పాడుకోవటం కనకవ్వ చిన్నప్పటి నుండి అలవాటు. ఇంటి పనులు,పంట పనులు చేసుకునే సమయంలో పాటలు పాడుకుంటూ పని చేసుకునేది కనకవ్వ
కనకవ్వ పాటలను విన్న ఊరిలోని కొంత మంది యువకులు వాటిని టిక్ టాక్ లో పెట్టగా అసాధారణ స్థాయిలో ఆదరణ వచ్చింది. ఆమె పాటలను MicTv. పాట ఆడిషన్ కు పంపగా ఎంపికయ్యారు ఆ తర్వాత పోటీలో మూడు వేలమంది ని దాటుకుని ప్రధమ స్థాయిలో నిలిచింది కనకవ్వ.
ఆ తరవాత నుండి కనకవ్వ పాటల పండుగ మొదలయింది.
కనకవ్వ చదువుకోలేదు,తన తల్లే తనకు బడి గుడి అంటారు కనకవ్వ
జీవితం లో కష్టాలు వస్తాయి, ఆకులు రాలిన కొమ్మకే చిగురుపుస్తాయి, మీకు ఎదురై కష్టాలకు భయపడద్దు అంటారు కనకవ్వ. కనకవ్వ పాటలు:
1.
2.
3.
4.
5.
6.
7.
8.