ముఖంపై మచ్చలు తొలగించుకోవడానికి చాలా మంది అనేక రకాల క్రీమ్స్ వాడుతుంటారు. అయితే చాలా మందికి ఆ క్రీమ్స్ పనిచేయవు. దీంతో మచ్చలను తొలగించుకోవడం కోసం వారు నానా తంటాలు పడుతుంటారు. హార్మోనుల సమస్య వల్ల ఎవరైతే ఇలా స్కిన్ ప్యాచ్ లు, మెడ మీద నల్ల చారలు, మచ్చలతో బాధపడుతున్నారో వారిని చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమస్య నుండి తక్షణం బయటపడాలంటే, నేచురల్ హోం రెమెడీస్ ఉపయోగపడుతాయి. ఇవి డార్క్ గా ఉన్న స్కిన్ ప్యాచ్ లను లైట్ చేస్తాయి.
అయితే, ఈ నేచురల్ రెమెడీస్ ఉపయోగించడానికి ముందు స్కిన్ టెస్ట్ చేసి తర్వాత నేరుగా స్కిన్ ప్యాచ్ లున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా అప్లై చేయకూడదు. మరి రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం.
నిమ్మరసం:
చర్మం మీద ఏర్పడ్డ స్కిన్ ప్యాచ్ లను మాయం చేయడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది . నిమ్మకాయను సగానికి కట్ చేసి చర్మం మీద అప్లై చేసి రబ్ చేయాలి. తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. తర్వాత 4-5గంటలు సేపు ఎండలో తిరగకుండా ఉండాలి.
పెరుగు:
ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ ఓట్స్, 2 చెంచాలా నిమ్మరసం మరియు ఒక చెంచా పెరుగు మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వీటిలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ మరియు బ్లీచింగ్ లక్షణాలు డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది
ఆరెంజ్:
విటమిన్ సి అధికంగా ఉండే ఆరెంజ్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది నేచురల్ గా స్కిన్ డార్క్ ప్యాచ్ లను నివారిస్తుంది . ప్యాచ్ ఉన్న ప్రదేశంలో ఆరెంజ్ తో మర్ధన చేయాలి . ఆరెంజ్ తొక్కను పౌడర్ గా చేసి మాస్క్ లా వేసుకోవచ్చు.
పాలు:
పాలు కలిపిన నీటితో ఒక వారం పాటు, స్నానం చేయడం వల్ల పాలలో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ శరీరంలో కనిపించే నల్లమచ్చలను నేచురల్ గా మాయం చేస్తుంది.
తేనె:
డార్క్ ప్యాచ్ ల మీద తేనెతో ప్యాక్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తేనెతో ప్యాక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత దాని మీద నిమ్మరసంను అప్లై చేయాలి. బాగా మసాజ్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా మూడు రోజుల తర్వాత తిరిగి అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.
కలబంద:
స్కిన్ మీద ఉండే డార్క్ ప్యాచ్ లకు అలోవెర జెల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ జెల్ తో ముఖం మీద నేరుగా మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తర్వాత పాలతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా ఒక వారం తర్వాత తిరిగి ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది.
పసుపు:
బౌల్లో కొద్దిగా పసుపు, పాలు మరియు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి చర్మానికి అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల డార్క్ స్కిన్ ప్యాచ్ లను నివారిస్తుంది . 10 రోజుల తర్వాత తిరిగి ఈ పద్దతిని అనుసరించాలి.