సకల శుభాలనిచ్చే ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలి ?

మన పురాణాల్లో ప్రతీ సమస్యకి ఒక ఆధ్యాత్మిక పరిష్కారం ఉంటుంది. అలాగే ఆర్థిక సమస్యలకు కొన్ని రకాల పరిష్కారాలు చూపించారు మన పెద్దలు. కొంతమంది రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తారు. సిరిసంపదలను పోగేయడానికి కృషి చేస్తారు. కానీ, వచ్చిన సంపద వచ్చినట్టే కర్పూర హారతిలా కరిగిపోతుంటుంది.

ఐశ్వర్య దీపంఎంత సంపాదించినా అంతకు మించిన ఖర్చులు వచ్చిపడతాయి. దాంతో నానా ఇబ్బందులు పడుతుంటారు. చేసిన కష్టం వృథా అయిపోతోందని తలలు పట్టుకునే వారుంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కునే వారికి ఐశ్వర్య దీపం విరుగుడని చెబుతోంది హిందూ ధర్మం. అసలు ఐశ్వర్య దీపం అంటే ఏంటి? ఈ ఐశర్యదీపం ఎలా పెట్టాలి? ఇప్పుడు తెలుసుకుందాం.

ఐశ్వర్య దీపంఉప్పుపై వెలిగించే దీపాన్నే ఉప్పు దీపం అంటారు. ప్రతి శుక్రవారం ఉదయం కానీ, సాయంత్రం కానీ దీపాన్ని పెట్టాల్సి ఉంటుంది. నెలపైన బియ్యం పిండి పసుపు కుంకుమతో ముగ్గు వేసి దానిపైన కొంచెం పెద్ద ప్రమిదలు ఒకదాని పైన ఒకటి పెట్టి అందులో ఒక పావు కిలో రాళ్ళ ఉప్పు వేసి ఆ రాళ్ళ ఉప్పుపై పసుపు కుంకుమ చల్లాలి. దానిమీద ఒక చిన్న ప్రమిదలు ఒకదాని పైన ఒకటి పెట్టి పసుపుకుంకుమా పూలు పెట్టి ప్రమిదలో నూనె కానీ నైయి కానీ పోసి రెండు ఒత్తులు ఒక్కటిగా వేసి వెలిగించాలి. అలా వెలిగించేటప్పుడు దీపం శ్లోకం చదువుకోవాలి. పండ్లు కానీ, పాలు, పటికబెల్లం, కొబ్బరికాయ ఏదైనా నివేదన నైవేద్యంగా పెట్టి, లక్ష్మీ, వేంకటేశ్వరస్వామి స్త్రోత్రం చదువుకోవాలి. కనకధార స్త్రోత్రం చదివినా మంచిదే.

ఐశ్వర్య దీపంశుక్రవారం ఇలా దీపారాధన చేశాక శనివారం రోజు ఆ ప్రమిధలోని ఉప్పును తీసి నీటిలో కలిపి ఇంటి బయట తొక్కుడు అవని స్థలంలో పోయాలి. అవకాశం ఉన్నవాళ్లు నదిలో కలపవచ్చు. ప్రమిధలు మార్చాల్సిన పని లేదు, ప్రతి వారం అవి వాడుకోవచ్చు. ప్రతి శుక్రవారం ఇలా ఉప్పు పైన దీపం వెలిగించి శనివారం రోజు ఆ ఉప్పు తీసేయాలి.

ఐశ్వర్య దీపంఅలా 11 శుక్రవారాలు కానీ 16 శుక్రవారం కానీ 21 కానీ 41 శుక్రవారాలు కానీ అనుకోని ఇంట్లో చేయాలి ఈ ఉప్పు దీపం ఈశాన్యం మూల పెట్టడం ఇంకా మంచి ఫలితం వస్తుంది. 41 శుక్రవారం ఈ ఉప్పు దీపం పెట్టే వారికి శాశ్వతంగా ధన పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. కొందరు ఇది రాక్ సాల్ట్ పైన పెడతారు కానీ రాళ్ళ ఉప్పు పైన పెట్టడమే సంప్రదాయం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR