పీరియడ్స్‌లో వచ్చే నొప్పి తగ్గాలంటే ఇలా చేయండి

మహిళలను ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య నెలసరి. చాలా మంది స్త్రీలు రుతుస్రావం సమయంలో కడుపు నొప్పి, నడుం నొప్పితో బాధపడుతుంటారు. నాలుగు రోజులపాటు తీవ్ర వేదన అనుభవిస్తారు. నెలసరి వచ్చినప్పుడు ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా కడుపు నొప్పి, మాటిమాటికీ కోపం రావడం, చిరాకు అధికమవుతాయి. హార్మోన్ల మార్పుల కారణంగా మూడ్ కూడా వెంట వెంటనే మారుతుంది.

2 Mana Aarogyam 219

పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది. కానీ అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం పీరియడ్స్ సమయంలో బయటకు వెళ్లిపోతుంది. చాలామందికి ఈ టైమ్‌లో పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. కానీ కొందరిలో నొప్పి అధికంగా ఉంటుంది.

పీరియడ్స్‌ఈ నొప్పులు చాలా అలసటతో కూడుకుని ఉంటాయి. మానసిక కల్లోలం, ఆహారం పై కోరిక, డయేరియా లేదా కడుపునొప్పి, ఒళ్ళు నొప్పులు, చికాకు మొదలైనవి కూడా కలుగుతాయి. ప్రతినెల ఐదు రోజుల పాటు నొప్పినివారణ మందులు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అలాంటి వారు కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నొప్పి తగ్గించొచ్చు.

హాట్ బ్యాగ్ ఉపయోగించండి:

పీరియడ్స్‌మీ పొత్తికడుపు మరియు నడుము వద్ద కొంచెం వేడితో కాపడం పెట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇలా చేస్తే కండరాలు వ్యాకోచించి శరీరానికి సులువుగా అనిపిస్తుంది. ఒక హాట్ వాటర్ బ్యాగ్ లో వేడి నీరు నింపి లేదా స్టోన్ పిల్లో తో గాని నొప్పి ఉన్న చోట కాపండి. స్టోన్ పిల్లోలో చిన్నచిన్న రాళ్లు మాదిరిగా ఉంటాయి. దీనితో మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

మర్దన:

పీరియడ్స్‌మీ శరీరాన్ని మర్దన చేసుకుని తేలికపరచుకుందామని ఎప్పుడైనా అనుకున్నారా? అయితే ఇదే సరైన సమయం. నెలసరి సమయంలో మీ శరీరం మరియు మనసు విశ్రాంతి కోరుకుంటాయి. మీ నడుము, కడుపు భాగం మరియు పక్కలలో పదిహేను నిమిషాలు మర్దన చేసుకుంటే 90 శాతం నొప్పులు తగ్గుతాయి. సువాసన కలిగిన నూనెతో మర్దన చేసుకుంటే ఇంకా హాయినిస్తాయి. ఆలివ్ ఆయిల్ లేదా కొబ్బరినూనెలో కొన్ని చుక్కల సువాసన కలిగిన నూనె కలపడం వలన ఆరోమాథెరపి వలన కలిగే ప్రయోజనాలు పొందవచ్చు.

దూరం పెట్టవలసిన ఆహార పదార్థాలు:

కడుపుబ్బరం మరియు శరీరంలో నీరు నిలుపుదల చేసే ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. కార్బనేటెడ్ పానీయాలు, కెఫిన్, కొవ్వు పదార్థాలు, అధిక ఉప్పు ఉన్న ఆహారం మరియు మద్యం సేవించకపోవడం ఉత్తమం. ఈ ఆహార పదార్థాలు మీ రక్తంతో చక్కెర స్థాయిని గజిబిజి చేసి నొప్పులను ఇంకా ఎక్కువగా చేస్తుంది.

బొప్పాయి:

Boppayపీరియడ్స్ రావడానికి ముందు బొప్పాయి పండు తినడం ఉపకరిస్తుంది. ఇందులో యాంటీ ఇన్‌ప్లేమటరీ గుణాలు ఉంటాయి. ఐరన్, కాల్షియంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి సంకోచించిన పొత్తి కడుపు కండరాలను తిరిగి సాధారణ స్థితికి తెస్తాయి.

తులసి:

Thulasiఆరోగ్య పరంగా తులసికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పీరియడ్స్ టైంలో నొప్పి తగ్గడానికి ఇవి ఎంతగానో ఉపకరిస్తాయి. వీటి వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. తులసి ఆకుల్ని కప్పు నీటిలో కలిపి వేడి చేయాలి. తర్వాత దాన్ని చల్లార్చి కొద్ది కొద్దిగా రెండు మూడు గంటలకోసారి తాగాలి. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది.

అల్లం:

పీరియడ్స్‌అల్లం తురుమును కప్పు నీటిలో కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత దాన్ని వడగట్టి తగినంత నిమ్మ రసం, తేనె కలపాలి. పీరియడ్స్ టైంలో రోజుకు రెండు మూడు సార్లు తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR