వేప వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

వేప అనేది 4000 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వాడబడుతున్న ఒక ఔషధ మూలిక. వేప చెట్టు యొక్క అన్ని భాగాలు వివిధ రకాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. వాస్తవానికి, వేప కూడా అరిష్ట అనగా “అనారోగ్యం యొక్క ఉపశమనం” అనే సంస్కృత పేరుతో పిలువబడుతుంది.

health benefits of neemవేప చెట్టు సాధారణంగా నిండుగా ఆకులను కలిగి ఉంటుంది మరియు 75 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది సాధారణంగా ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతుంది. అయితే, ఇది దక్షిణ ఇరాన్ దీవులలో కూడా పెరుగుతుంది. ఇది ఆకు పచ్చ రంగులో ఉంటుంది, ఈ చెట్టు భారతదేశంలో రోడ్డు పక్కలందు సులభంగా పెంచడాన్ని చూడవచ్చు.

health benefits of neemప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న దేశాలలో సుమారు 80% జనాభా సంప్రదాయ ఔషధాలపై ఆధారపడుతున్నారు, ఇవి సాధారణంగా మొక్కలు మరియు మొక్కల యొక్క ఉత్పత్తులను కలిగి ఉంటాయి. చర్మ అంటువ్యాధులు, సెప్టిక్ పుళ్ళు, సోకిన కాలిన గాయాలు మరియు మానవ శరీరాన్ని ప్రభావితం చేసే కొన్ని ఫంగల్ అంటు వ్యాధులు మరియు వివిధ రోగాలను వేప చెట్టు నయం చేస్తుందనేది తెలిసిన విషయమే.

health benefits of neemకాలేయ పనితీరును మెరుగుపరచడం, రక్తంలో చక్కెర స్థాయిలను సమానంగా ఉండేలా చేయుటలో వేప ఆకులు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. వెచ్చని నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడం వలన ఆటలమ్మ వ్యాధిలో బాధపడుతున్నవారికి ఇది సమర్థవంతoగా పని చేస్తుంది. వేదాలలో, వేపను “సర్వ రోగ నివారిణి” గా సూచిస్తారు, అంటే దీని అర్ధం “అన్ని రోగాలను నయం చేయునది”.

వేప యొక్క ప్రయోజనాలు:

చర్మ సంరక్షణ ప్రయోజనాలు:

health benefits of neemవేపాకులను తీసుకోవడం ద్వారా రక్తం శుద్ధవుతుంది. టాక్సిన్స్ తొలగిపోతాయి. చర్మం క్లియర్ గా మారుతుంది. వేపాకులలో యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్ పుష్కలంగా కలవు. ఇవి ఇన్ఫెక్షన్స్ పై పోరాటం జరుపుతాయి. అలాగే కాలిన గాయలు మరియు ఇతర చర్మ సమస్యలను తగ్గిస్తాయి. వేపాకుల పేస్ట్ మరియు పసుపును కలిపి పురుగు కాట్లు, దురద, ఎక్జిమా, రింగ్ వార్మ్ మరియు కొన్ని చిన్నపాటి స్కిన్ డిసీసెస్ నుంచి రక్షణను పొందవచ్చు. వేపాకులను నమలడం ద్వారా చర్మానికి పోషణ అందుతుంది. చర్మం తేటగా అలాగే కాంతివంతంగా మారుతుంది.

శిరోజాల సంరక్షణకు:

health benefits of neemవేపాకులను నమలడం ద్వారా శిరోజాలకు తగినంత పోషణ లభిస్తుంది. వేపాకులలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. వేప అనేది స్కాల్ప్ కు ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే వేపాకులు హెల్దీ సెల్ డివిజన్ ను ప్రేరేపించి స్కాల్ప్ పై హెయిర్ ఫాలికల్ గ్రోత్ ను పెంపొందిస్తాయి. మరిగించిన వేప నీళ్లను ఉపయోగించి తలస్నానం చేస్తే డాండ్రఫ్ సమస్య తొలగిపోతుంది. దెబ్బతిన్న శిరోజాలు కోలుకోవడం ప్రారంభిస్తాయి. వేపాకులలో యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి మలసేజియా వంటి డాండ్రఫ్ కి దారితీసే ఫంగస్ పై పోరాటం జరుపుతాయి. వేపలో నున్న అద్భుతమైన ఔషధ గుణాల వలన స్కాల్ప్ రక్షణకారి అన్న పేరును వేప సొంతం చేసుకుంది.

కంటి సంరక్షణకు తోడ్పడుతుంది:

health benefits of neemవేపాకులు కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వేపాకులను నమలడం ద్వారా కంటి చూపును మెరుగుపరచుకోవచ్చు. అలాగే కళ్ళల్లో మంట, ఇరిటేషన్, అలసట వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం వేపను నీళ్ళల్లో మరగబెట్టి చల్లారిన తరువాత ఈ నీళ్లను ఐ వాష్ గా వాడుకోవాలి.

రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది:

health benefits of neemయాంటీ మైక్రోబాక్టీరియల్, యాంటీ వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ పుష్కలంగా లభించడం వలన వేపాకులను నమలడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఈ ఆకులను నమలడం వలన ఫ్రీ రాడికల్స్ ద్వారా తలెత్తే డామేజ్ అరికట్టబడుతుంది. తద్వారా అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుముఖం పడుతుంది. ఫ్లూ, క్యాన్సర్ మరియు గుండె వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గే అవకాశాలున్నాయి. బాక్టీరియాను హరించి రోగనిరోధక శక్తిని పెంపొందించే సామర్థ్యం వేపలో ఉంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

health benefits of neemవేపాకులు లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. తద్వారా, జీర్ణక్రియ ఆటోమేటిగ్గా మెరుగవుతుంది. వీటితో పాటు, వేపను రోజూ తీసుకోవడం వల్ల ఇంటస్టిన్ లో నివసించే హానికర బాక్టీరియా అనేది హరించబడుతుంది. కొలోన్ శుభ్రపడుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఓరల్ హెల్త్:

health benefits of neemవేపాకులను రెగ్యులర్ గా నమలడం వలన అనేక దంత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే, గర్భిణీలు వేపాకులను తీసుకోకూడదు. వేప అనేది లోపల నుంచి వేడిని ఉత్పత్తి చేస్తుంది. అందువలన, గర్భస్థ శిశువుకు హానీ జరిగే ప్రమాదం ఉంది. అలాగే, గర్భం దాల్చాలని ప్రయత్నిస్తున్న మహిళలు కూడా వేపాకుల ను అవాయిడ్ చేయాలి. వేపాకులను తీసుకోవడం ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి గర్భం దాల్చే అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. అధిక వేడిని తగ్గించుకునేందుకు శరీర ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచేందుకు నీళ్లను అధికంగా తీసుకోవడంతో పాటు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ను తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR